
హీరోహీరోయిన్లు పెళ్లి చేసుకోవడం కొత్తమీ కాదు. అయితే ఆ బంధాన్ని నిలుపుకున్నవారు చిత్రసీమలో తక్కువమందే ఉంటారు. నాటితరంలో కృష్ణ-విజయనిర్మల ఆ బంధాన్ని ఎక్కువకాలం నిలుపుకున్నారు. నేటితరంలో ఆయన కుమారుడు మహేష్ బాబు కూడా వివాహ బంధాన్ని ఎక్కువకాలం కొనసాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
Also Read: ‘నిశ్శబ్ధం’ ఫ్లాప్ కు ఆయనే కారణమా?
టాలీవుడ్లో మహేష్ బాబు-నమ్రతలు బెస్ట్ కపుల్ గా పేరుతెచ్చుకున్నారు. వీరిద్దరి ప్రేమ వివాహం. ఫిబ్రవరి 10, 2005లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. వీరి అనోన్య దంపత్యానికి గుర్తుగా గౌతమ్, సితారలు జన్మించారు. వీరిద్దరు తొలి నటించిన ‘వంశీ’ చిత్రం నేటితో(అక్టోబర్ 4) 20ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమా షూటింగు సమయంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. వీరిద్దరిలో ఎవరూ ముందుగా ప్రపోజ్ చేశారనేది ఆసక్తికరంగా మారింది.
వంశీ చిత్రం కోసం నమత్ర-మహేష్ బాబు తొలిసారి కలిసి నటించారు. అప్పటికే నమత్ర బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించింది. మహేష్ కు ‘వంశీ’ చిత్రం మూడోది. ఈ సినిమా షూటింగ్ 25రోజులపాటు న్యూజిల్యాండ్ లో జరిగింది. అన్నిరోజులపాటు నమ్రత అవుట్ డోర్ షూటింగ్ వెళ్లడం అదే తొలిసారట. ఆ సమయంలో వీరిద్దరి మాటలు కలిసి స్నేహంగా మారింది.
ఆ తర్వాత కొద్దిరోజులకు వీరిది స్నేహం కాదని.. ప్రేమ అని తేలింది. ఒకరోజు నమ్రత సడెన్ గా మహేష్ బాబు ఫోన్ చేసి ప్రపోజ్ చేసింది. అప్పటికే మహేష్ కు నమ్రత అంటే ఇష్టం ఉండటంతో ఒకే చెప్పాడట. ఆ తర్వాత నాలుగేళ్లకు వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈలోపు నమ్రత అప్పటికే తాను ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేసింది. ఆ తర్వాత పెళ్లిపీఠలెక్కింది. ఆ తర్వాత నుంచి ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది.
Also Read: బిగ్ బాస్ కాదు బ్యాడ్ బాస్.. అన్యాయంగా ఇద్దరి ఎలిమినేషన్..?
మహేష్ బాబు లాంటి భర్త దొరకడం తన అదృష్టమని నమ్రత ఇప్పటికీ చెబుతూ ఉంటోంది. మహేష్ ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తాడని.. తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటాడని.. కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతారని చెప్పింది. వీటన్నింటికి మించి ఆయనో గొప్ప మానవతావాది అంటూ నమ్రతా కితాబిచ్చింది. అందుకే తనకు మహేష్ అంటే తనకు ప్రేమ.. ఆరాధన అని చెబుతోంది. తన జీవితంలో తనకు లభించిన అతిపెద్ద గిఫ్ట్ పెళ్లేనంటూ నమ్రత ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటోంది.