
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం ‘సర్కారువారిపాట’. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీని ప్రారంభించి ఫస్టు లుక్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ కు అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. అయితే కరోనా కారణంగా ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు.ఈ మూవీ షూటింగ్ అమెరికాలో ప్రారంభించేలా దర్శకుడు పర్శురాం సన్నహాలు చేస్తున్నారు. అయితే చిత్ర ప్రారంభానికి ముందే చిత్రయూనిట్లో పలు కీలక మార్పులు జరుగుతున్నాయి. ‘సర్కారువారిపాట’ సినిమాకు ముందుగా పి.ఎస్.వినోద్ ను కెమెరామెన్ గా తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన స్థానంలో మరొకరు వచ్చి చేరారు.పీ.ఎస్ వినోద్ ప్రస్తుతం పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ కు కెమెరామెన్ గా పని చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ‘వకీల్ సాబ్’ పూర్తయ్యాక వినోద్ సర్కారువారిపాట కోసం పని చేసేవాడు. అయితే కరోనా కారణంగా ‘వకీల్ సాబ్’ ఆలస్యం అవుతోంది. దీంతో రెండు సినిమాలు ఒకేసారి చేయడం వీలుకాకపోవడంతో వినోద్ సర్కారువారిపాట నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో మది కెమెరామన్ గా పని చేయనున్నారు.
Also Read: బిగ్ బాస్ కాదు బ్యాడ్ బాస్.. అన్యాయంగా ఇద్దరి ఎలిమినేషన్..?
త్వరలోనే ‘సర్కారువారిపాట’ టీమ్ అమెరికా ఫ్లైట్ ఎక్కేందుకు రెడీ అవుతోెంది. చిత్రంలో పని చేస్తున్న నటీనటులు, సాంకేతిక సిబ్బందికి కార్వంటైన్లో ఉంచి ఆ తర్వాత షూటింగ్ ప్రారంభించేలా చిత్రబృందం సన్నహాలు చేస్తోంది. కాగా ఈ మూవీలో మహేష్ సరసన కీర్తీ సురేష్ నటించే అవకాశం ఉందనే టాక్ విన్పిస్తోంది.