
కేరళలో శిక్షణ విమానం కూలి ఇద్దరు నావికా సిబ్బంది ఆదివారం మృతి చెందారు. రోజువారి శిక్షణలో భాగంగా ఐఎన్‌ఎన్ గరుడకు చెందిన పవర్ గ్ల్లైడర్ టేకాప్ తీసుకుంది. కొద్ది సేపటి వరకు ఆకాశంలో తిరిగి ఒక్కసారిగా తొప్పుంపాడి బ్రడ్జి సమీపంలో నేలకూలింది. ఈ ఘటనలో లెప్టినెంట్ రాజీవ్ ఝా, పెట్టి ఆఫీసర్ సునీల్ కుమార్ మృతి చెందారు. విషయం తెలిసిన అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని వారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Also Read: కరోనా నుంచి కోలుకొనే పరిస్థితి లేదా?