తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శీతల గాలులు వీస్తున్నాయి. చలి కమ్మేస్తోంది. చలికి పిల్లలు, వృద్ధులు వణికిచస్తున్నారు. తెలంగాణలో రాగల మూడు రోజులు ఇలాగే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొంది.
Also Read: వామన్ రావు చనిపోతూ చెప్పిన పేరు.. సంచలన వీడియో బయటపెట్టిన రేవంత్ రెడ్డి
గురు , శుక్రవారాల్లో హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలు పడ్డాయి. ఈ క్రమంలో వాతావరణ కేంద్రం ఒక హెచ్చరిక ప్రకటన చేసింది. ఈ శీతల గాలులతో కరోనా సహా వైరల్ వ్యాధులు ప్రబలుతాయని పేర్కొంది.
ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ తీరం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం 1.5 కిలోమీటర్ల నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. అలాగే దక్షిణ మధ్య మహారాష్ట్ర, పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీన పడిందని తెలిపారు.
Also Read: ఆ టాప్ మూడు చానెళ్లను బహిష్కరించిన టీడీపీ.. కారణమిదే?
ఈ ఆవర్తనం వల్ల తెలంగాణ ఏపీలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం, ఆదివారం రోజుల్లో సైతం ఇలానే ఉంటుందని పిల్లలు, వృద్ధులు బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కరోనా కు ఈ వాతావరణం అనుకూలం అని బయటకు రావద్దని సూచించింది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్