ఉప్పెన టాలీవుడ్ ఇండస్ట్రీని ఊపేసింది. తుఫాన్ లా విరుచుకుపడింది. సినిమాకు హిట్ టాక్ రావడంతో కాసుల వర్షం కురుస్తోంది. ఇప్పటికే చాలా రికార్డులను తిరిగి రాసిన ఈ సినిమా తాజాగా అరుదైన రికార్డును అందుకుంది. తొలి వారం రోజుల్లోనే రూ.70 కోట్ల గ్రాస్ వసూలు చేసి వైష్ణవ్ తేజ్, బుచ్చిబాబు కెరీర్ లో మరుపురాని చిత్రంగా నిలిచింది.
Also Read: ఓరి నాయనో.. బట్టలన్నీ విప్పేసిన పాయల్!
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పంజా వైష్ణవ్ హీరోగా పరిచయం అయిన మూవీ ‘ఉప్పెన’. కన్నడ బ్యూటీ కృతీశెట్టి హీరోయిన్ గా నటించింది. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నెగెటివ్ పాత్రను పోషించారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ పతాకాలపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. ఈ నెల 12న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ.. భారీ సక్సెస్ దిశగా దూసుకెళ్తోంది.
భారీ ప్రమోషన్స్ నడుమ.. కావాల్సినంత హైప్ తో రిలీజ్ అయ్యిందీ సినిమా. మెగా హీరో కావడం.. మంచి ప్రమోషన్ జరగడంతో ‘ఉప్పెన’ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. ఈ సినిమా నైజాం హక్కులు రూ. 6 కోట్లు, సీడెడ్ రైట్స్ రూ. 3 కోట్లు, ఆంధ్రా ప్రాంత హక్కులు రూ 10 కోట్లు వరకూ అమ్ముడు పోయాయి. ఓవర్సీస్‌తో కలుపుకుంటే మొత్తంగా రూ. 20 కోట్ల వ్యాపారం జరిగింది. దీంతో రూ. 21 కోట్ల వసూళ్లు లక్ష్యంగా రిలీజ్ అయ్యిందీ చిత్రం.
Also Read: రాంచరణ్ బలం ఏంటో తెలుసా? వైరల్ ఫొటో
కరోనా భయంతో థియేటర్లు మూతపడి జనాలు వస్తారో రారో అనుకున్నా ఈ ఎనిమిది నెలల గ్యాప్ తర్వాత రిలీజ్ అయిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. ఉప్పెనలా వచ్చి చూస్తున్నారు. అందుకే కేవలం వారం రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కొత్త హీరో, హీరోయిన్లు , దర్శకుడైనా కూడా ఈ సినిమా రికార్డులు సృష్టించడం విశేషం.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
Telugu Cinema is truly back to it's glory. #Uppena grosses over 70 Crores in the 1st week with all your love ❤️#BlockbusterUppena 🌊#PanjaVaisshnavTej @IamKrithiShetty @VijaySethuOffl @BuchiBabuSana @ThisIsDSP @aryasukku @SukumarWritings @adityamusic pic.twitter.com/zuXDK4vzDn
— Mythri Movie Makers (@MythriOfficial) February 19, 2021