జగన్ కరుణించే ఆ ఆరుగురు అదృష్టవంతులు ఎవరో..?

ఏపీలో మరో ఎన్నికల వేడి రాజుకుంది. ఈసారి వైసీపీలో ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. చాలా మంది పదవుల ఆశలో ఉన్నారు. పంచాయతీ ఎన్నికల విజయాలతో జోష్ మీదున్న జగన్ ఇప్పుడు ఖాళీ అయిన ఆ ఆరు ఎమ్మెల్సీ పదవుల్లోనూ నేతలను ఎంపిక చేసేందుకు రెడీ అయ్యారు. పంచాయతీ, మున్సిపల్, జడ్పీ ఎన్నికల ఊపులోనే తాజాగా ఏపీలో ఖాళీ కాబోతున్న 6 ఎమ్మల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఆశావహులంతా ఇప్పుడు […]

Written By: NARESH, Updated On : February 20, 2021 2:04 pm
Follow us on

ఏపీలో మరో ఎన్నికల వేడి రాజుకుంది. ఈసారి వైసీపీలో ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. చాలా మంది పదవుల ఆశలో ఉన్నారు. పంచాయతీ ఎన్నికల విజయాలతో జోష్ మీదున్న జగన్ ఇప్పుడు ఖాళీ అయిన ఆ ఆరు ఎమ్మెల్సీ పదవుల్లోనూ నేతలను ఎంపిక చేసేందుకు రెడీ అయ్యారు. పంచాయతీ, మున్సిపల్, జడ్పీ ఎన్నికల ఊపులోనే తాజాగా ఏపీలో ఖాళీ కాబోతున్న 6 ఎమ్మల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఆశావహులంతా ఇప్పుడు అమరావతి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

Also Read: హైఅలెర్ట్: మారిన వాతావరణం.. విస్తరిస్తున్న కరోనా

ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి.. 151 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నా దృష్ట్యా ఖాళీ అయిన ఈ ఆరు స్థానాలను వైసీపీ కైవసం చేసుకోవడం తథ్యం.. అయితే ఆ పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య వైసీపీలో ఎక్కువగా ఉంది. సీఎం జగన్ ఎన్నికల వేళ చాలా మందికి హామీ ఇచ్చారు. దీంతో ఆ పదవులు ఎవరికి దక్కుతాయనేది ఆసక్తిగా మారింది.

ఎమ్మెల్సీ పదవులపై మొత్తం నిర్ణయం సీఎం జగన్ పై ఆధారపడి ఉంది. ఇప్పటికే జగన్ వీటిపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇందులో ఒక పదవిని టాలీవుడ్ సినీ సెలబ్రెటీలకు ఇచ్చే యోచనలో జగన్ ఉన్నాడట.. ఎన్నికల వేళ మోహన్ బాబు, అలీ, జీవితా రాజశేఖర్, ఫృథ్వీ సహా చాలా మంది పాటుపడడంతో ఆ దిశగా జగన్ ఆలోచిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

Also Read: వామన్ రావు చనిపోతూ చెప్పిన పేరు.. సంచలన వీడియో బయటపెట్టిన రేవంత్ రెడ్డి

ప్రస్తుతం వైసీపీలో ఈ ఆరు ఎమ్మెల్సీ సీట్ల కోసం రాజకీయ నాయకులు పోటీపడుతున్నారు. అందులో ప్రధానంగా చూస్తే… లేళ్ల అప్పిరెడ్డి, మర్రి రాజశేఖర్, షేక్ ముజుబుల్ రెహమాన్, మోషేన్ రాజు, తోట త్రిమూర్తులు, కూడిపూడి చిట్టబ్బాయ్, తోట వాణి, బల్లి చక్రవర్తి పేర్లు ప్రచారంలో ఉన్నాయి.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్