‘రంగ్ దే’ ట్రైలర్ టాక్: యూత్ ఫుల్ ప్రేమ గోస

సహజంగా అబ్బాయిలు వెంటపడుతారు.. ప్రేమిస్తామంటారు.. పెళ్లికి బలవంతం చేసి కాపురం చేస్తారు. కానీ ‘రంగ్ దే’ సినిమాలో సీన్ రివర్స్. హీరో నితిన్ నో చెబుతుంటే హీరోయిన్ కీర్తి సురేష్ బలవంతం చేసి నితిన్ తో సంసారం చేసి తల్లికూడా అవుతుంది. నాకు నచ్చలేదంటున్నా అతడిని రేప్ చేస్తుందనే చెప్పాలి. అయితే నవ్వుల కామెడీతో మొదలైన నితిన్, కీర్తి పరిచయం ఆ తర్వాత రోమాంటిక్ యాంగిల్ గా మారి.. చివరకు కాదన్న ప్రియుడిని ప్రేమించిన అమ్మాయి చీకొడితే […]

Written By: NARESH, Updated On : March 19, 2021 7:26 pm
Follow us on

సహజంగా అబ్బాయిలు వెంటపడుతారు.. ప్రేమిస్తామంటారు.. పెళ్లికి బలవంతం చేసి కాపురం చేస్తారు. కానీ ‘రంగ్ దే’ సినిమాలో సీన్ రివర్స్. హీరో నితిన్ నో చెబుతుంటే హీరోయిన్ కీర్తి సురేష్ బలవంతం చేసి నితిన్ తో సంసారం చేసి తల్లికూడా అవుతుంది. నాకు నచ్చలేదంటున్నా అతడిని రేప్ చేస్తుందనే చెప్పాలి.

అయితే నవ్వుల కామెడీతో మొదలైన నితిన్, కీర్తి పరిచయం ఆ తర్వాత రోమాంటిక్ యాంగిల్ గా మారి.. చివరకు కాదన్న ప్రియుడిని ప్రేమించిన అమ్మాయి చీకొడితే ఆ వేధనను అనుభవించే వ్యక్తిగా నితిన్ నటన హైలెట్ అని చెప్పాలి.

కథ యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైన్ మెంట్ గా రూపొందించిన ఈ చిత్రం ట్రైలర్ ఆహ్లాదరకంగా.. నేటి ట్రెండ్స్ కు తగ్గట్టుగా ఆకట్టుకుంటోంది. నితిన్, కీర్తి,వెన్నెల కిషోర్, నరేశ్ ఇలా మంచి పాత్రధారులు ఈ ట్రైలర్ లో కనిపించి నవ్వులు పూయించారు.

భీష్మ తరువాత నితిన్ చేస్తున్న ఈ సినిమాకు యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. సితారా ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది. ఈనెల 26న థియేటర్లోకి ఈ సినిమా రానుంది.