దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో బంగారం కొనుగోలు చేయాలంటేనే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. కనీసం 50,000 రూపాయలు చేతిలో ఉంటే మాత్రమే బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అయితే బంగారం ధరలు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. బులియన్ మార్కెట్ నిపుణులు బంగారం ధర ఈ ఏడాది రూ.5,000 తగ్గవచ్చని చెబుతున్నారు.
ఈ ఏడాది బంగారం ధర అంచనాలకు అందని స్థాయిలో పెరిగినా కొత్త ఏడాదిలో మాత్రం తగ్గుతుందని.. కరోనా వ్యాక్సిన్ లభ్యతపై బంగారం ధర ఆధారపడి ఉంటుందని తెలుపుతున్నారు. ఇటీవల కాలంలో బంగారం ధర భారీగా పెరిగిందని.. కొత్తగా బంగారం కొనుగోలు చేయాలనే ఆలోచన ఉంటే మాత్రం కొన్ని రోజులు ఓపిక పడితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఫైజర్ కంపెనీ ఇప్పటికే తమ వ్యాక్సిన్ 95 శాతం సమర్థవంతంగా పని చేస్తుందని కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
మిగిలిన వ్యాక్సిన్లు సైతం 90 శాతానికి పైగా ప్రభావవంతంగా పని చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో వచ్చే ఏడాది నాటికి బంగారం ధర రూ.5000కు పైగా తగ్గొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫైజర్ వ్యాక్సిన్ తో పాటు జనవరి నాటికి మార్కెట్ లోకి మరికొన్ని వ్యాక్సిన్లు సైతం అందుబాటులోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బంగారం ధర తగ్గితే మాత్రం కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంటుంది.
ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ కరోనా వ్యాక్సిన్ సైతం 90 శాతం పని చేస్తోందని తెలుస్తోంది. బంగారు ఆభరణాలు అత్యవసరమైతే తప్ప కొనుగోలుకు దూరంగా ఉంటే మంచిది. భారీగా బంగారం ధర దిగి వస్తే మాత్రం కొనుగోలుదారులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పాలి.