https://oktelugu.com/

నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. రూ.24,000తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..!

నిరుద్యోగులకు గత కొన్ని రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం వరుస శుభవార్తలు చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నేషనల్ పవర్ థర్మల్ కార్పొరేషన్ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. 70 అప్రెంటీస్‌ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఎన్టీపీసీ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఒడిశా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని ఎన్టీపీసీ ప్రాజెక్టుల్లో ఉద్యోగం చేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెకానికల్, ఎలక్ట్రికల్, మైనింగ్ విభాగాల్లో ఖాళీలు ఉండగా అర్హత ఉన్న […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 23, 2020 / 06:51 PM IST
    Follow us on


    నిరుద్యోగులకు గత కొన్ని రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం వరుస శుభవార్తలు చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నేషనల్ పవర్ థర్మల్ కార్పొరేషన్ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. 70 అప్రెంటీస్‌ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఎన్టీపీసీ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఒడిశా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని ఎన్టీపీసీ ప్రాజెక్టుల్లో ఉద్యోగం చేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

    మెకానికల్, ఎలక్ట్రికల్, మైనింగ్ విభాగాల్లో ఖాళీలు ఉండగా అర్హత ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఇంజనీరింగ్ లో డిప్లొమా పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. https://ntpccareers.net/ వెబ్ సైట్ లో నోటిఫికేషన్ కు ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. మొత్తం ఖాళీలు 70 కాగా అందులో మైనింగ్ కు సంబంధించి 40 ఉన్నాయి.

    ఎలక్ట్రికల్ ఖాళీలు 12 ఉండగా మెకానికల్ 8, మైనింగ్ సర్వేలో 8 ఖాళీలు ఉన్నాయి. కనీసం 70 శాతం మార్కులతో పాసైన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపులు అమలులో ఉంటాయి.

    ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ అభ్యర్థులు 300 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఆన్ లైన్ పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. నవంబర్ 23వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా డిసెంబర్ 12 దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది.