https://oktelugu.com/

మోడీ సర్కార్ అష్టదిగ్బంధనం.. కేంద్రానికి దారేది?

కొత్త వ్యవసాయ చట్టాలతో రైతుల మెడకు ఓ వైపు ఉరిబిగిస్తూ.. మరోవైపు చర్చలు, కమిటీల పేరిట కేంద్రంలోని బీజేపీ సర్కార్ కాలయాపన చేస్తోంది. ఇప్పటికే దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎవరెన్ని చెప్పినా వినకుండా పోతున్నా కేంద్రంపై ఇప్పుడు రైతులే రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. Also Read: తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. దుబ్బాక ఫలితం రిపీట్ కానుందా? దాదాపు ‘0’ డిగ్రీల సెల్సియస్ కు ఉష్ణోగ్రత పడిపోయింది. ఎముకలు కొరికే చలి వణికిస్తోంది. అయినా రైతన్నలు […]

Written By:
  • NARESH
  • , Updated On : December 3, 2020 10:47 am
    Follow us on

    కొత్త వ్యవసాయ చట్టాలతో రైతుల మెడకు ఓ వైపు ఉరిబిగిస్తూ.. మరోవైపు చర్చలు, కమిటీల పేరిట కేంద్రంలోని బీజేపీ సర్కార్ కాలయాపన చేస్తోంది. ఇప్పటికే దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎవరెన్ని చెప్పినా వినకుండా పోతున్నా కేంద్రంపై ఇప్పుడు రైతులే రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    Also Read: తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. దుబ్బాక ఫలితం రిపీట్ కానుందా?

    దాదాపు ‘0’ డిగ్రీల సెల్సియస్ కు ఉష్ణోగ్రత పడిపోయింది. ఎముకలు కొరికే చలి వణికిస్తోంది. అయినా రైతన్నలు వెనకడుగు వేయడం లేదు. అంత చలిలోనూ కేంద్రంపై ఫైట్ చేస్తున్నారు. కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులు ఇంత ఆందోళన చేస్తున్నా కేంద్రం చర్చలు, కమిటీల పేరిట కాలయాపన చేస్తోంది.

    రైతులంతా కలిసి ఢిల్లీని ముట్టడించారు. పంజాబ్, హర్యానా రైతులే కాదు.. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున రైతుల వస్తున్నారు.నోయిడా జిల్లా సరిహద్దును మూసివేయాల్సి వచ్చింది. ఢిల్లీకి ఉత్తర భారతం నుంచి వచ్చే అయిదు కీలక రహదారులను మూసివేయడంతో ఇప్పుడు ప్రయాణికులు నరకం చూస్తున్నారు. ఇక రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా ట్రాన్స్ పోర్టును వచ్చేనెల 9 నుంచి నిలిపివేస్తామని.. వాహనాల సమ్మె చేస్తామని ఆ ఆసోసియేషన్ రైతులకు మద్దతు తెలిపింది. దీంతో కేంద్రంలోని బీజేపీని రైతులు అష్టదిగ్భంధనం చేస్తున్నట్టు తెలుస్తోంది.

    Also Read: 24 గంటలకు.. జీహెచ్ఎంసీలో పోలింగ్ శాతం ఫైనల్ ఇదీ!

    ప్రధానం గా రైతులు తక్షణమే పార్లమెంట్ సమావేశం నిర్వహించాలని.. ఇదే చివరి అవకాశం అని కేంద్రానికి హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలోనే పంజాబ్ సీఎంతో నేడు అమిత్ షా భేటి కాబోతున్నారు. రైతులతోనూ మరో దఫా చర్చలు జరుపుతున్నారు. అయితే కాంగ్రెస్ పాలిత పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కేంద్రంలోని బీజేపీ సహకరించే పరిస్థితులు లేవు. దీంతో ఢిల్లీకి దారులన్నీ మూసుకుపోయి అల్లకల్లోలం చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతుల ఆందోళనతో ఢిల్లీకి వచ్చే ప్రధాన 5 మార్గాలలో కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ నిలిచిపోయింది.

    మోడీ సర్కార్ గద్దెనెక్కినప్పటి నుంచి ఈ స్థాయిలో సర్కార్ కు సెగ తగలింది లేదు. ఎప్పుడూ ఇంత ప్రజా వ్యతిరేకత వచ్చింది లేదు. అయితే కొత్త వ్యవసాయ చట్టాలు కార్పొరేట్లకు మేలు చేసేలా ఉన్నాయన్న రైతుల అనుమానాలను కేంద్రం తీర్చలేకపోతోంది. అదే సమయంలో వారి భయాలను పరిష్కరించలేకపోతోంది. ఇదే ఇప్పుడు రైతు ఉద్యమంగా మారింది. ఈ సెగ ఢిల్లీ పీఠాలను కదిలించే ప్రమాదం లేకపోలేదని.. ఇప్పటికైనా చట్టాలు చేసే ముందు మోడీ సర్కార్ కాస్త అందరినీ సంప్రదించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్