https://oktelugu.com/

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సౌత్‌ వెస్ట్ర‌న్ రైల్వేలో ఉద్యోగాలు..?

సౌత్ వెస్ట్రన్ రైల్వే నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 21 ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. హుబ్లీ ముఖ్య కేంద్రంగా ఉన్న సౌత్ వెస్ట్రన్ రైల్వే స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా డిసెంబర్ 28 దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో క్రీడల్లో ఆడి ఉన్నవారు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 3, 2020 / 08:42 AM IST
    Follow us on


    సౌత్ వెస్ట్రన్ రైల్వే నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 21 ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. హుబ్లీ ముఖ్య కేంద్రంగా ఉన్న సౌత్ వెస్ట్రన్ రైల్వే స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా డిసెంబర్ 28 దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో క్రీడల్లో ఆడి ఉన్నవారు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    Also Read: పేద విద్యార్థులకు ఎల్ఐసీ శుభవార్త.. 20వేల రూపాయల స్కాలర్ షిప్..?

    మొత్తం 21 ఖాళీలలో అథ్లెటిక్స్ మెన్ – 3 ఖాళీలు, అథ్లెటిక్స్ ఉమెన్ – 3 ఖాళీలు, బ్యాడ్మింటన్ మెన్ – 2 ఖాళీలు, క్రికెట్ మెన్ – 3 ఖాళీలు, వెయిట్ లిఫ్టింగ్ మెన్ – 2 ఖాళీలు, టిబుల్ టెన్నిస్ మెన్ – 1 ఖాళీ, హాకీ మెన్ – 4 ఖాళీలు, గోల్ఫ్ మెన్ – రెండు ఖాళీలు ఉన్నాయి. https://www.rrchubli.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

    Also Read: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. లక్ష రూపాయల వేతనంతో ఉద్యోగాలు..?

    పదో తరగతి, ఇంటర్ పాసైన వాళ్లు పోస్టును బట్టి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు. రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్, 2 వ అంతస్తు, పాత జీఎం ఆఫీస్ బిల్డింగ్ క్లబ్ రోడ్, హుబ్లీ – 582323 చిరునామాకు దరఖాస్తు లను పంపాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఫీల్డ్ ట్రయల్స్, క్రీడా విజయాల మదింపు, మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

    మరిన్ని: విద్య / ఉద్యోగాలు కోసం

    స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు కావడంతో ఈ ఉద్యోగాలకు పోటీ తక్కువగా ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవఛు. రైల్వే శాఖ వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తూ ఉండటంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది.