spot_img
Homeబిజినెస్SUV Citroen Basalt X: మిడిల్ క్లాస్ పీపుల్స్ అనుకున్న బడ్జెట్ లోనే SUV కారు.....

SUV Citroen Basalt X: మిడిల్ క్లాస్ పీపుల్స్ అనుకున్న బడ్జెట్ లోనే SUV కారు.. ఫీచర్స్ మాత్రం అదుర్స్..

SUV Citroen Basalt X: SUV కారు కొనాలని చాలామందికి ఉంటుంది. కానీ ఈ రేంజ్ లో ఉండే కారు ధరతో కూడుకొని ఉంటుంది. అంతేకాకుండా SUV కార్లు ప్రీమియం లుక్ తో కనిపిస్తాయి. అయితే ఇప్పుడు కొన్ని కంపెనీలు బడ్జెట్ లోనే సామాన్యులకు అందించేందుకు ఈ రకమైన కార్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఇలాంటి కంపెనీల్లో Citroen ఒకటి. TATA కంపెనీ నుంచి కర్వ్ లాంటి SUV కార్లు మార్కెట్లోకి వచ్చాయి. అయితే ఇదే సమానమైన లుక్ తో పాటు ఇంజిన్ పనితీరు మెరుగ్గా ఉండే Citroen కంపెనీ కారు ఆకర్షిస్తుంది. ఇంతకీ ఆ కారు ఏదో ఇప్పుడు చూద్దాం..

TATA కంపెనీకి చెందిన కర్వ్ చూసి చాలామంది కొనుగోలు చేయాలని అనుకుంటారు. కానీ దీని ధర రూ.9 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లో విక్రయిస్తున్నారు. కానీ ఇదే కారు ఫీచర్స్, సమానమైన ఇంజన్ కలిగిన Citroen Basalt X అనే కారు రూ.8.15 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. అయితే ఈ కారు తక్కువ ధర మాత్రమే కాకుండా అద్భుతమైన ఫీచర్లను కూడా కలిగి ఉంది. ఈ కారు చూడడానికి స్టైలిష్ గా ఉంటుంది. ఖరీదైన కార్ల వలె రూఫ్ లైన్ వంగి ఉంటుంది. ఒకరకంగా స్పోర్ట్ కార్వాలే కనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ లో LED హెడ్ లైట్స్, పగటిపూట కూడా ప్రకాశవంతంగా మెరిసే లైట్లు, వెనుక వైపు LED టెయిల్ లైట్స్ కారుకు అందర్నీ తీసుకువచ్చాయి. ఇన్నర్ లో కూడా లేటెస్ట్ టెక్నాలజీ తో కూడిన ఫీచర్లో ఉన్నాయి. కారు ఇంజన్ విషయంలో ఏమాత్రం తగ్గేదేలే అన్నట్టుగా ఉంది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ను అమర్చారు. ఇది 82 పిహెచ్ పవర్ తో పాటు 115 NM టార్క్ ను రిలీజ్ చేస్తుంది. నగర ప్రయాణికులకు ఇది అనుగుణంగా ఉంటుంది. అలాగే 1.2 లీటర్ టర్బో ఇంజన్ కూడా ఉండడంతో నగరాల్లో ప్రయాణం చేసే వారికి స్మూత్ డ్రైవింగ్ ఉంటుంది.

కార్యాలయ అవసరాలతో పాటు లాంగ్ డ్రైవ్ చేసేవారికి కూడా ఈ ఇంజన్ అనుగుణంగా ఉంటుంది. ఇందులో 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లు ఉండడంతో లీటర్ ఇంధనానికి 18 నుంచి 19.5 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వడంతో మిడిల్ క్లాస్ పీపుల్స్ కు బడ్జెట్ అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇందులో నీటి తరం వారికి అనుగుణంగా ఫీచర్లను అమర్చారు. 10.2 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం తో పాటు.. ఆపిల్ కార్ ప్లే, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే వంటి ఫీచర్లు ఆకర్షిస్తాయి. దీంతో ప్రయాణికులకు కూడా సౌకర్యవంతంగా ఉండి దూర ప్రయాణాలు చేయడానికి అనుగుణంగా ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Chiranjeevi: చిరంజీవి కెరియర్ లో చేసిన మూడు తప్పులు ఇవే…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒక సామాన్య మానవుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా మారవచ్చు అని ప్రూవ్ చేసిన...

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ వెనక ఇన్ని కారణాలున్నాయి…

Vijay Deverakonda: 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ... ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా...

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
Oktelugu Epaper
Exit mobile version