ఈ మధ్య కాలంలో చాలామంది కీళ్లనొప్పుల సమస్యతో బాధ పడుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా 25 సంవత్సరాల పైబడిన వారు సైతం కీళ్లనొప్పుల బారిన పడుతూ ఉన్నారు. ఒక్కసారి కీళ్లనొప్పుల బారిన పడితే ఎన్ని మందులు వాడినా నొప్పులు తగ్గవు. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా కీళ్ల నొప్పుల సమస్యకు చెక్ పెట్టడంతో పాటు మంచి ఫలితాలు ఉంటాయ్. కీళ్ల నొప్పులతో బాధ పడేవాళ్లు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి.
Also Read: పిస్తా పప్పు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
కూరగాయలు, పండ్లను డైట్ లో భాగం తీసుకోవాలి. కూరగాయలను సలాడ్ లేదా సూప్ రూపంలో తీసుకుంటే మంచిది. వెల్లుల్లి, అల్లం, పసుపుతో తయారు చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. కాఫీ, టీ, చక్కెరతో తయారు చేసిన పదార్థాలు, బేకరీ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోకూడదు. పాలిష్ చేసిన బియ్యం తీసుకోకపోతే మంచిది. కొవ్వు ఎక్కువగా ఉండే మాంసాహారానికి వీలైనంత దూరంగా ఉంటే కీళ్ల నొప్పుల సమస్యకు చెక్ పెట్టవచ్చు.
Also Read: నిమ్మరసం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?
చేప, అక్రోట్ గింజలు, అవిసె లాంటి ఒమేగా 3 ఎక్కువగా ఉండే ఆహారనికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతిరోజూ సరైన ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేయడం ద్వారా కీళ్లనొప్పుల సమస్యకు చెక్ పెట్టడం సాధ్యమే. చాలామంది కీళ్ల నొప్పుల సమస్యకు తాత్కాలిక పరిష్కారంగా తరచూ మందులు వాడుతూ ఉంటారు. అయితే వైద్యుల సూచనలు తీసుకోకుండా ఇష్టానుసారం మందులు వాడకూడదు.
మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం
చికెం, మటన్, ఫిష్ వారానికి ఒకసారి మాత్రమే తీసుకోవాలి. మోకాలికి చల్లని క్లాత్ తో మసాజ్ చేయడం ద్వారా కూడా నొప్పులను తగ్గించుకోవచ్చు. క్యారెట్లు ఎక్కువగా తినడం మెంతులు నానబెట్టిన నీళ్లతో కాళ్లు శుభ్రం చేయడం ద్వారా సమస్యకు చెక్ పెట్టవచ్చు.