సీఎం కేసీఆర్ మరోసారి వరాల మూట విప్పారు. ఈసారి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను టార్గెట్ చేశారు. వారికి రిజర్వేషన్ల వల విసిరారు. 50 శాతం రిజర్వేషన్లు దాటడం రాజ్యాంగం ప్రకారం కుదరకున్నా కేసీఆర్ మాత్రం రిజర్వేషన్ల అమలుకే డిసైడ్ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read: కాబోయే సీఎం కేటీఆర్ అన్న పద్మారావు.. దానికి కేటీఆర్ ఏమన్నాడంటే?
తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)లకు అమలు చేసే రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
ప్రస్తుత రిజర్వేషన్లు తెలంగాణలో యాథవిధిగా కొనసాగిస్తూనే అదనంగా ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10శవాతం రిజర్వేషన్ అమలు చేయనున్నారు.
Also Read: ఎంత గొప్ప పనిచేశావ్?.. అసలు సిసలు లీడర్ అంటే నువ్వేనయ్య హరీష్ రావు
ఇప్పటికే తెలంగాణలో 50శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ తో కలిపి రిజర్వేషన్లు 60శాతానికి పెరగనున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఈ అంశంపై విధివిధానాలు రూపొందించాలని.. రెండు మూడు రోజుల్లోనే ఉన్నత స్థాయి సమీక్షకుకేసీఆర్ రెడీ అయ్యారు. సమీక్ష అనంతరం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై మార్గదర్శకాలు జారీ చేయనున్నారు.
తెలంగాణలో 50వేల ఉద్యోగ నియామకాల ప్రకటన నేపథ్యంలోనే ఎంతో మంది నిరుద్యోగులకు అవకాశం దక్కేలా కేసీఆర్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్