https://oktelugu.com/

రేటింగ్ లో ‘ఆకాశం నీ హద్దు రా’ !

లేడీ డైరెక్టర్ సుధా కొంగర “ఆకాశం నీ హద్దు రా” సినిమాతో మంచి ప్రశంసలు అందుకుంటూ.. రికార్డ్స్ క్రియేట్ చేసింది. నిజానికి ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ అయినా భారీ హిట్ అనిపించుకుంది. విమర్శకుల నుంచి కూడా మంచి రేటింగ్స్ పొందింది అంటే.. అది సుధా కొంగర గొప్పతనమే. ఏది ఏమైనా సూర్యలాంటి స్టార్ ని పెట్టి.. గొప్ప ఎమోషనల్ డ్రామాని తెరకెక్కించడం.. ఒక్క సుధా కొంగరకే సాధ్యం అయింది. ఇక లాక్ డౌన్ లో డైరెక్ట్ […]

Written By:
  • admin
  • , Updated On : January 21, 2021 / 06:00 PM IST
    Follow us on


    లేడీ డైరెక్టర్ సుధా కొంగర “ఆకాశం నీ హద్దు రా” సినిమాతో మంచి ప్రశంసలు అందుకుంటూ.. రికార్డ్స్ క్రియేట్ చేసింది. నిజానికి ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ అయినా భారీ హిట్ అనిపించుకుంది. విమర్శకుల నుంచి కూడా మంచి రేటింగ్స్ పొందింది అంటే.. అది సుధా కొంగర గొప్పతనమే. ఏది ఏమైనా సూర్యలాంటి స్టార్ ని పెట్టి.. గొప్ప ఎమోషనల్ డ్రామాని తెరకెక్కించడం.. ఒక్క సుధా కొంగరకే సాధ్యం అయింది. ఇక లాక్ డౌన్ లో డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చింది ఈ సినిమా.

    Also Read:సోనూ సూద్ కు హైకోర్టులో చుక్కెదురు !

    కాగా డిజిటల్ వేదికపై డైరెక్ట్ గా రిలీజయిన ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రసారం చేసింది జెమినీ టీవీ. అయితే ‘ఆకాశం నీ హద్దురా’కి ఏపీ, తెలంగాణ పట్టణ ప్రాంతాల్లో 6.77 TVR వచ్చిందంటే.. ఒకవిధంగా ఇది పెద్ద రికార్డే. ఎందుకంటే గతంలో ఎన్నడూ ఒక అనువాద చిత్రానికి ఈ రేంజ్ రేటింగ్ వచ్చిన సందర్భాలు లేవు. ఇక సూర్య కెరీర్ లో ఉత్తమ చిత్రం అనే ప్రశంసలు దక్కించుకుంది ఈ సినిమా.

    Also Read: అనిల్ రావిపూడి పర్యవేక్షణలో “గాలి సంపత్” !

    కాగా డెక్కన్ ఎయిర్ వేస్ ఫౌండర్ జి ఆర్ గోపినాధ్ బియోగ్రఫీగా తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య నటన నభూతో నభవిష్యత్ అన్నట్లు సాగింది. తమిళంలో సూరారై పోట్రుగా విడుదలైన ఈ మూవీలో మోహన్ బాబు ఓ కీలక రోల్ చేశారు. అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. అపర్ణ బాలమురళి సూర్యకి జంటగా నటించగా, జీవీ ప్రకాష్ సంగీతం అందించాడు. సూర్యకి గత రెండు చిత్రాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా ఈ సినిమా సూపర్ హిట్ ను ఇచ్చింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్