ఇంగ్లండ్ బ్యాటింగ్ ఫస్ట్: భారత జట్టులో అనూహ్య మార్పులు.. షాకిచ్చిన కోహ్లీ

ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించి సంచలనం సృష్టించిన టీమిండియా ఇప్పుడు సొంతగడ్డపై పటిష్టమైన ఇంగ్లండ్ ను ఢీకొంటోంది. ఇంగ్లండ్ ఇండియాల మధ్య భీకరపోరు ఖాయంగా కనిపిస్తోంది. చెన్నై వేదికగా జరిగే తొలి టెస్ట్ ఆరంభమైంది. Also Read: రైతుల ఆందోళనపై సంచలన వ్యాఖ్యలు చేసిన విరాట్ కోహ్లీ శ్రీలంకతో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లండ్ అదే జోష్ లో ఇప్పుడు టీమిండియాను ఎదుర్కొంటోంది. ఈ సిరీస్ లో టీమిండియానే హాట్ ఫేవరేట్ గా కనిపిస్తోంది. రెగ్యులర్ […]

Written By: NARESH, Updated On : February 5, 2021 9:33 am
Follow us on

ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించి సంచలనం సృష్టించిన టీమిండియా ఇప్పుడు సొంతగడ్డపై పటిష్టమైన ఇంగ్లండ్ ను ఢీకొంటోంది. ఇంగ్లండ్ ఇండియాల మధ్య భీకరపోరు ఖాయంగా కనిపిస్తోంది. చెన్నై వేదికగా జరిగే తొలి టెస్ట్ ఆరంభమైంది.

Also Read: రైతుల ఆందోళనపై సంచలన వ్యాఖ్యలు చేసిన విరాట్ కోహ్లీ

శ్రీలంకతో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లండ్ అదే జోష్ లో ఇప్పుడు టీమిండియాను ఎదుర్కొంటోంది. ఈ సిరీస్ లో టీమిండియానే హాట్ ఫేవరేట్ గా కనిపిస్తోంది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాలు జట్టులోకి వచ్చారు.ఇక ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ కూడా బీకర ఫామ్ లో ఉన్నాడు. ఇంగ్లండ్ జట్టు కూడా సీనియర్లతో గట్టిగా ఉంది. బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, అర్చర్, అండర్సన్ వంటి సీనియర్లతో పటిష్టంగా కనిపిస్తోంది. వీరందరూ ఐపీఎల్ ఆడడంతో మ్యాచ్ టైట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

తొలుత టాస్ గెలిచి ఇంగ్లండ్ బ్యాంటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలోనే భారత్ బౌలింగ్ కు దిగనుంది. అయితే జట్టు కూర్పులో అనూహ్యమైన మార్పు ఒకటి జరిగింది. ఎవ్వరూ ఊహించిన ఒక బౌలర్ భారత జట్టులోకి వచ్చారు.

ఇప్పటికే పంత్ ఖాయం అని కెప్టెన్ కోహ్లీ ప్రకటించాడు. అయితే ఆస్ట్రేలియాలో సిడ్నీ టెస్టులో వీరోచితంగా ఆడిన వాషింగ్టన్ సుందర్ కు జట్టులో చోటు కల్పించారు. చివరి బ్రిస్టేన్ టెస్ట్ ఆడిన ఆటగాళ్లను బ్యాంటింగ్ లో కొనసాగించారు. ఇక బౌలర్లలో అనూహ్యంగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ షాబాజ్ నదీంను టీమిండియా జట్టులోకి తీసుకుంది.

Also Read: వైరల్: సన్ రైజర్స్ కు అండగా ‘గచ్చిబౌలి దివాకర్’ రె‘ఢీ’!

ఇంగ్లండ్పై శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ లసిత్ ఎంబుల్దేనియా రెండు టెస్టులకు 15 వికెట్లు తీసుకోవడంతో కోహ్లీ టీమిండియా నదీమ్ కు అవకాశం ఇచ్చి ఆశ్చర్యపరిచింది. ఇతడికి ఇదే తొలి టెస్ట్ కావడం విశేషం. నదీమ్ ఇంగ్లండ్ తో టెస్ట్ తోనూ అరంగేట్రం చేస్తున్నారు.

వీరితోపాటు వాష్టింగ్టన్ సుందర్, అశ్విన్ స్పిన్నర్లుగా ఉన్నారు. ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా లు పేసర్లుగా జట్టులో ఉన్నారు. బ్యాటింగ్ లో రోహిత్, గిల్, పూజారా, కోహ్లీ, రహానే, పంత్ లతో పటిష్టంగా ఉంది. ఈ ఉదయం 9.30 గంటల నుంచి టెస్ట్ కొనసాగనుంది.