https://oktelugu.com/

చంద్రబాబుకు షాకిచ్చిన నిమ్మగడ్డ.. టీడీపీ మేనిఫెస్టోకు చెక్

‘అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. బోల్తాపడ్డాడులే చంద్రబాబు’ అంటూ ఇప్పుడు వైసీపీ నేతలు సంబరపడుతున్నారట.. ఎప్పుడూ బొమ్మే కాదు.. బొరుసు కూడా పడుతుందని తేలింది. ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ తో కలిసి ఏపీ ప్రభుత్వాన్ని ఓ ఆట ఆడిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు షాక్ తగిలింది. ఆ షాక్ ఇచ్చింది ఎవరో కాదు.. స్వయంగా ఆయన నామినేట్ చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ కావడమే గమనార్హం. దీంతో టీడీపీ అధినేతకు దిమ్మదిరిగి బొమ్మ కనపడింది. Also […]

Written By:
  • NARESH
  • , Updated On : February 5, 2021 9:38 am
    Follow us on

    Nimmagadda Chandrababu

    ‘అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. బోల్తాపడ్డాడులే చంద్రబాబు’ అంటూ ఇప్పుడు వైసీపీ నేతలు సంబరపడుతున్నారట.. ఎప్పుడూ బొమ్మే కాదు.. బొరుసు కూడా పడుతుందని తేలింది. ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ తో కలిసి ఏపీ ప్రభుత్వాన్ని ఓ ఆట ఆడిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు షాక్ తగిలింది. ఆ షాక్ ఇచ్చింది ఎవరో కాదు.. స్వయంగా ఆయన నామినేట్ చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ కావడమే గమనార్హం. దీంతో టీడీపీ అధినేతకు దిమ్మదిరిగి బొమ్మ కనపడింది.

    Also Read: పార్లమెంట్ లో గళం.. ఏపీకి వైసీపీ ఎంపీలు ఏం సాధించారో తెలుసా?

    ఏపీ పంచాయితీ ఎన్నికల వేళ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల ప్రకటించిన తెలుగుదేశం పార్టీ పంచాయితీ ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికల కోడ్ కు విరుద్ధమని.. దాన్ని ఉపసంహరించుకోవాలని ఆదేశించి షాక్ ఇచ్చారు. మేనిఫెస్టోపై తెలుగు దేశం పార్టీ వివరణ సంతృప్తికరంగా లేదని స్పష్టం చేసింది. జిల్లాలకు పంపిన మేనిఫెస్టో కాపీలను వెనక్కి తీసుకోవాలని.. మేనిఫెస్టోతో ఎలాంటి ప్రచారం నిర్వహించవద్దని ఆదేశించారు.

    ఎన్నడూ లేనిది టీడీపీ అధినేత చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే భవిష్యత్తులో ఏం చేస్తామో తెలుపుతూ ‘మేనిఫెస్టో’ విడుదల చేశాడు..కానీ పంచాయితీ ఎన్నికలకు ఇప్పటివరకు ఎవరూ చేయరు. తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా మేనిఫెస్టో రిలీజ్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

    Also Read: బీజేపీకి ‘పల్నాడు ఆశాదీపం’ అంబటి నవకుమార్

    40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు.. పంచాయతీ ఎన్నికలు పార్టీలకతీతంగా జరిగేవని తెలిసినా ఇలా పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయడంపై వైసీపీ ఫిర్యాదు చేసింది. అది ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన అనే విషయాన్ని వైసీపీ ఎస్ఈసీ నిమ్మగడ్డకు ఫిర్యాదు చేసింది. దీంతో కమిషనర్‌‌ ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనిఫెస్టోను ముద్రించినట్లుగా క్లెయిమ్ చేసుకున్న టీడీపీ కార్యదర్శి మద్దిపాటి వెంకటరాజుకు నోటీసులు జారీ చేసి వివరణ సరిగా లేకపోవడంతో దాన్ని బ్రేక్ చేశారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్