కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులకు ప్రయోజనం చేకూరేలా కీలక ప్రకటన చేసింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కర్ దివ్యాంగులు ఇకపై టోల్ ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదని లోక్ సభలో కీలక ప్రకటన చేశారు. బీజేపీ ఎంపీ రమేశ్ బిదురీ నేడు లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో దివ్యాంగులకు టోల్ ఫీజు మినహాయింపు కల్పిస్తున్నారా..? అని ప్రశ్నించారు.
Also Read: ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశారా.. ఏ తప్పుకు ఎంత జరిమానా అంటే..?
ఆ ప్రశ్నకు నితిన్ గడ్కరీ స్పందిస్తూ దివ్యాంగులకు టోల్ ఫీజు నుంచి మినహాయింపు కల్పిస్తున్నామని వెల్లడించారు. దివ్యాంగుల కొరకు యూజర్ ఫ్రెండ్లీగా ఉండే వాహనాలను తయారు చేయాలని కంపెనీలకు సూచించారు. అలా వాహనాలను డిజైన్ చేసే కంపెనీలను కూడా ప్రోత్సహిస్తామని తెలిపారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే దివ్యాంగుల వాహనాలకు రోడ్ ట్యాక్స్ ను ఎత్తివేశాయని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.
Also Read: శ్రీవారి భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త.. అదేంటంటే..?
కేంద్రం చేసిన ఈ ప్రకటనపై దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి దేశంలో ఫాస్టాగ్ విధానం అమలులోకి రానున్న సంగతి తెలిసిందే. వాహనదారులు టోల్ గేట్ ను దాటాలంటే ఫాస్టాగ్ ఉండాల్సిందే. వాహనాలకు ఫాస్టాగ్ లేకపోతే రెండు లేదా మూడు రెట్లు టోల్ ఫీజును చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. టోల్ గేట్ల దగ్గర రద్దీని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ ఫాస్టాగ్ విధానాన్ని కేంద్రం అమలులోకి తెచ్చింది.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
వాహనం ముందు అద్దం లేదా సైడ్ మిర్రర్ పై వాహనం రిజిస్ట్రేషన్ వివరాలతో కూడిన ఒక బార్ కోడ్ ను అతికిస్తారు. అమర్చిన ఈ స్టిక్కర్ నే ఫాస్టాగ్ పేరుతో పిలుస్తారు. మొబైల్ ఫోన్ సిమ్ ను ఏ విధంగా రీచార్జ్ చేసుకుంటామో ఫాస్టాగ్ ను కూడా అదే విధంగా రీఛార్జ్ చేసుకోవచ్చు.