దుబ్బాక ఎన్నిక ఫలితాలు వస్తున్నాయి.. సిద్ధిపేట జిల్లాలో ఉన్న దుబ్బాక నియోజకవర్గం ఉప ఎన్నికకు ముందు ఎవరికీ తెలిసేది కాదు. కానీ అనుహ్యంగా టీఆర్ఎస్, బీజేపీల మధ్య జరిగిన తారాస్థాయి పోరుతో రాష్ట్రవ్యాప్తంగా దుబ్బాక నియోజకవర్గం వార్తల్లో నిలిచింది. దుబ్బాక ఉప ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ చేసినప్పడు కూడా దీని గురించి ఎవరూ పట్టించుకోలేదు. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కాబట్టి, అధికారంలో ఉన్నందున ఎలాగూ ఆ పార్టీ గెలుస్తుందనే ఊహించారు. అయితే రానురాను దుబ్బాకలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ తీవ్రమైంది.
Also Read: దుబ్బాకలో బీజేపీ లీడ్.. ఏం జరుగుతోంది
టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అవసరమయింది. దీంతో టీఆర్ఎస్ నుంచి ఆయన సతీమణి సుజాతరెడ్డికే పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించింది. బీజేపీ నుంచి అంతకు ముందు ఓడిపోతూ వస్తున్న రఘునందన్ రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస రెడ్డి పోటీలో నిలబడ్డారు. ప్రధానంగా మూడు పార్టీలు పోటీలో నిలబడ్డా గట్టి పోరు మాత్రం టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే సాగింది.
అయితే పోలింగ్ వరకు దుబ్బాక ప్రజలు అయోమయంగానే ఉన్నారు. ఇప్పటి వరకు చుట్టుపక్కల నియోజకవర్గాలైన సిద్ధిపేట, గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాలు అభివ… చేసిన కేసీఆర్ ప్రభుత్వం తమ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదన్న అభిప్రాయం ఉండేది. దీంతో మంత్రి హరీశ్ రావుకు ప్రచార బాధ్యతలను అప్పగించారు. ఇప్పటి వరకు అభివృద్ధి జరగలేదన్న మాట వాస్తవేమనని, అయితే ఇప్పుడు అభి…. చేసే బాధ్యత తనదేనని ప్రచారం చేశారు. దీంతో టీఆర్ఎస్ వైపే ఓటర్లు మొగ్గు చూపినట్లు సమాచారం.
ఆ తరువాత రఘునందన్ రావు బంధువుల ఇంట్లో నగదు లభ్యం కావడం, అది బీజేపీ అభ్యర్థిదేనని పోలీసులు తెలపడంతో పరిస్థతి ఉద్రిక్తంగా మారింది. ఈ తరుణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుడా రంగంలోకి దిగి తన ఘాటు వ్యాఖ్యలతో ప్రచారం చేశారు. దీనికి సీఎం కేసీఆర్ సైతం స్పందించి కేంద్రంపై నిప్పులు చెరిగారు. దీంతో ఒక్కసారిగా బీజేపీకి బలం పెరిగినట్లయింది. ఒకానోక దశలో బీజేపీ గెలిచినట్లేనని అనుకున్నారు. కాననీ బీజేపీకి ఓటు వేస్తే లాభం ఏంటనే కోణంలో కూడా ఓటర్లు ఆలోచించసాగారు.
Also Read: నువ్వు మగాడివి అయితే.. కేటీఆర్ పై ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు
దుబ్బాక పోలింగ్ జరిగిన రోజు సాయంత్రం కొన్ని సర్వే సంస్థలు ఎగ్జిట్ ఫోల్స్ ప్రకటించాయి. మిషన్ చాణక్య, సీ ఓటరు లాంటి వారు ఈ నియోజకవర్గంలో బీజేపీ గెలుస్తుందని తెలిపారు. ఇతర సంస్థలు మాత్రం టీఆర్ఎస్ వైపే ఓటర్లు మొగ్గు చూపారని ప్రకటించారు. దీంతో బీజేపీ శ్రేణుల్లో లోలోపల సంబరాలు చేసుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
కానీ కొన్ని పరిస్థతుల వల్ల టీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు తమ నియోజకవర్గాన్ని పట్టించుకోని ప్రభుత్వం ఇక నుంచైనా అభి.. చేస్తుందనే నమ్మకాన్ని ఓటర్లు టీఆర్ ఎస్ పై పెట్టారని సమాచారం. కరోనా సమయంలోనూ కూడా పోలింగ్ శాతం తగ్గలేదు. పోలింగ్ శాతం పెరిగితే ఏ ఉప ఎన్నికలోనైనా అధికార ప్రభుత్వందే గెలుపు ఉండే అవకాశాలు ఎక్కువ. ఈ నమ్మకంతోనే టీఆర్ఎస్ ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మెజారిటీ విషయం పక్కనబెడితే టీఆర్ఎస్ గెలుపు ఖాయమనే తెలుస్తోంది.