దేశంలో లక్షల సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల ఉద్యోగులకు పీఎఫ్ ఖాతాలు ఉన్నాయి. అయితే కొందరు పీఎఫ్ ఖాతాదారులు డబ్బు విత్ డ్రా చేసుకునే సమయంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పన్నుభారం పడకుండా తప్పించుకోవచ్చు. సాధారణంగా ఐదు సంవత్సరాలు ఉద్యోగం చేసిన తరువాత మాత్రమే పీఎఫ్ విత్ డ్రా చేసుకోవాలి. అలా చేయడం ద్వారా పన్ను భారం పడదు.
Also Read: చలికాలంలో బెల్లం తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?
అలా కాకుండా ఐదు సంవత్సరాల కంటే ముందుగానే పీఎఫ్ విత్ డ్రా చేసుకుంటే మాత్రం తప్పనిసరిగా ట్యాక్స్ చెల్లించాలి. ఉద్యోగులు ఎవరైతే 50 శాతం కంటే ఎక్కువ పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేస్తారో వాళ్లు 10 శాతం టీడీఎస్ ను చెల్లించాల్సి ఉంటుంది. అంత మొత్తం టీడీఎస్ రూపంలో చెల్లిస్తే ఉద్యోగులు నష్టపోతారు. అయితే ఇలా నష్టపోకుండా ఉండాలన్నా, పన్ను భారం నుంచి తప్పించుకోవాలన్నా ఒక మార్గం ఉంది.
Also Read: పెళ్లి కాని మగాళ్లకు షాకింగ్ న్యూస్.. కరోనా రిస్క్ ఎక్కువట..?
ఆదాయం తక్కువగా ఉన్నవారు పీఎఫ్ నగదును విత్ డ్రా చేసుకున్నా టీడీఎస్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఎవరైతే రెండున్నర లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగి ఉంటారో వారు టీడీఎస్ ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇందుకోసం 15జీహెచ్ ఫామ్ ను సమర్పించాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా అర్హులైన వాళ్లు సులభంగా ప్రయోజనం పొందవచ్చు. ఈ విషయం తెలియకపోతే మాత్రం నష్టపోవాల్సి ఉంటుంది.
పీఎఫ్ అకౌంట్ ఉన్న సబ్ స్క్రైబర్ మరణించినా, ఏదైనా కారణాల కంపెనీ మూసివేసినా, కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించడం లేదా ఉద్యోగం మానేయడం చేస్తే కూడా పీఎఫ్ నగదును విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. పీఎఫ్ నిబంధనలపై పూర్తిగా అవగాహన కలిగి ఉంటే పీఎఫ్ యొక్క ప్రయోజనాలను పూర్తిస్థాయిలో పొందవచ్చు.