https://oktelugu.com/

పోలవరంపై కేంద్రం మెలిక..జగన్ ఆశలు అడియాశలు..

ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టుపై సీరియస్ గా చర్చ సాగుతోంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పనులు ప్రారంభించింది అంతకుముందున్న టీడీపీ ప్రభుత్వం. అయితే ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో పోలవరం పనుల్లో అక్రమాలు జరిగాయని, ఐదేళ్లు గడిచినా ప్రాజెక్టు పూర్త చేయలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పూర్తి చేస్తామని వైసీపీ ప్రచారం చేసింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీకి పోలవరం పనులు కొనసాగించాలంటే ఇబ్బందులు […]

Written By:
  • NARESH
  • , Updated On : November 10, 2020 / 08:33 AM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టుపై సీరియస్ గా చర్చ సాగుతోంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పనులు ప్రారంభించింది అంతకుముందున్న టీడీపీ ప్రభుత్వం. అయితే ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో పోలవరం పనుల్లో అక్రమాలు జరిగాయని, ఐదేళ్లు గడిచినా ప్రాజెక్టు పూర్త చేయలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పూర్తి చేస్తామని వైసీపీ ప్రచారం చేసింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీకి పోలవరం పనులు కొనసాగించాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

    Also Read: సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు జగన్ లేఖ.. వ్యూహం ఫలించిందా?

    2019 ఎన్నికల తరువాత మోడీకి మద్దతుగా ఉంటూ వస్తున్న జగన్ పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని కోరుతూ వస్తున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా విలువ రూ.20398.61 కోట్లు. కానీ కొన్ని కారణాల వల్ల అంచనా విలువ పెరిగిపోయింది. దీంతో కేంద్రం విడుదల చేయాల్సిన నిధులపై ఏపీకి మోడీ ప్రభుత్వం మెలికలు పెడుతోంది. భూసేకరణ, పునరావాసం విషయంలో కేంద్రానికి సంబంధం లేదని, ఆ విషయంలో ఖర్చును రాష్ట్రప్రభుత్వాలే భరించాలని తెలుపుతోంది.

    Also Read: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు..?

    ఇందుకు జగన్ అంగీకరించడంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ. 2,234.288 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. అయితే ఈ నిధులను నేరుగా జగన్ ప్రభుత్వానికి కాకుండా పీడీ అకౌంట్ ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఇందులో నిధులు వేస్తామని ప్రాజెక్టుకు వాడుకోవచ్చని తెలిపింది. పీడీ అకౌంట్ ద్వారా వచ్చే నిధులు కేవలం ప్రాజెక్టు కోసమే వినియోగించాలి. ఇతర అవరసరాలకు ఉపయోగించరాదు. దీంతో జగన్ ఆశలు అడియాశలయ్యాయి.

    ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న జగన్ ఖజానాలో నిధులు ఖాళీ అయినట్లు తెలుస్తోంది. కేంద్రం పోలవరం నిధులు విడుదల చేస్తే సంక్షేమ పథకాలకు వినియోగించుకొని వచ్చే ఎన్నకల కోసం ప్రజల్లోకి వెళ్లాలని భావించారు. అయితే కేంద్రం పీడీ అకౌంట్ రూపంలో షాక్ ఇవ్వడంతో జగన్ అయోమయంలో పడ్డారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    కాగా సోమవారం నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టు హై లెవల్ ఫేజ్-2 పనులను ప్రారంభించారు. నీటి విలువ తెలుసిన ప్రభుత్వం మాది.. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చారు. 2022వరకు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రకటించారు. దీంతో జగన్ కేంద్రం నిధులతో పోలవరం ప్రాజెక్టు ను ఏవిధంగా పూర్తి చేస్తాడో చూడాలి.