నేడు దేశవ్యాప్తంగా డ్రై రన్.. వ్యాక్సిన్ ఖర్చును ఎవరు భరిస్తున్నారు?

కొత్త ఏడాదిలో కరోనా వ్యాక్సిన్ ను దేశ ప్రజలందరికీ పంపిణీ చేస్తామని కేంద్రం ప్రకటించింది. దీనిలో భాగంగానే కొన్ని రాష్ట్రాల్లో డ్రైరన్ చేపట్టింది. డిసెంబర్ 28, 29 తేదిల్లో అస్సాం.. ఆంధ్రప్రదేశ్.. గుజరాత్ రాష్ట్రాల్లో కేంద్రం డ్రై రన్ చేపట్టింది. ఆయా రాష్ట్రాల సమన్వయంతో కేంద్రం చేపట్టిన డ్రై రన్ మొదటి విడుత విజయవంతమైంది. దీంతో కేంద్రం నేడు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో డ్రై రన్ చేపట్టేందుకు సిద్ధమైంది. ఇందుకోసం కేంద్రం ఇప్పటికే భారీ కసరత్తులను చేసింది. […]

Written By: Neelambaram, Updated On : January 2, 2021 10:07 am
Follow us on

కొత్త ఏడాదిలో కరోనా వ్యాక్సిన్ ను దేశ ప్రజలందరికీ పంపిణీ చేస్తామని కేంద్రం ప్రకటించింది. దీనిలో భాగంగానే కొన్ని రాష్ట్రాల్లో డ్రైరన్ చేపట్టింది. డిసెంబర్ 28, 29 తేదిల్లో అస్సాం.. ఆంధ్రప్రదేశ్.. గుజరాత్ రాష్ట్రాల్లో కేంద్రం డ్రై రన్ చేపట్టింది.

ఆయా రాష్ట్రాల సమన్వయంతో కేంద్రం చేపట్టిన డ్రై రన్ మొదటి విడుత విజయవంతమైంది. దీంతో కేంద్రం నేడు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో డ్రై రన్ చేపట్టేందుకు సిద్ధమైంది. ఇందుకోసం కేంద్రం ఇప్పటికే భారీ కసరత్తులను చేసింది.

నేడు దేశవ్యాప్తంగా డ్రైరన్ చేపట్టిన అనంతరం కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఇండియాకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఐదు కోట్ల వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు రెడీగా ఉన్నట్లు ప్రకటించింది.

ఈ వ్యాక్సిన్ కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీజీసీఐ) అనుమతి ఇవ్వాల్సి ఉంది. డీజీసీఐ అనుమతి ఇచ్చిన రెండ్రోజుల్లో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు సిద్ధమని సీరమ్ ఇనిస్టిట్యూట్ ప్రకటించింది.

కరోనాను అరికట్టేందుకు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. ఒక్క డోస్ ఇచ్చిన తర్వాత మరో నాలుగు వారాలకు మరో డోస్ తీసుకోవాల్సి ఉంటుంది.

సీరమ్ కంపెనీ తయారు చేసిన ఒక్కో డోస్ ఖరీదు రూ.225 నుంచి 240 రూపాయాలు ఉంటుందని తెలుస్తోంది. కేంద్రం ఈ కంపెనీకు రూ.400 చెల్లించనుందని సమాచారం.

కేంద్రం ఒక్క డోస్ కే డబ్బులు చెల్లిస్తే రెండో డోస్ రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తారా? లేదంటే ప్రజలపై భారం వేస్తారా? అనేది తేలాల్సి ఉంది. వ్యాక్సిన్ పంపిణీలోగా ఈ విషయంలో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక సీరమ్ కంపెనీ తయారుచేసిన కోవీషిల్డ్ వ్యాక్సిన్ ఇండియాలో రూ.400లకు విక్రయిస్తుంటే.. విదేశాల్లో వ్యాక్సిన్ రూ.700 నుంచి రూ. 800 వరకు లభ్యం కానుందని సమాచారం.