https://oktelugu.com/

క్రేజ్ ను బాగా క్యాష్ చేసుకుంటుంది !

బిగ్‌ బాస్ షోకి వెళ్లి ముందు మంచి పాపులారిటీ తెచ్చుకున్నా.. ఆ తర్వాత ఆ క్రేజ్ తో కెరీర్ బిల్డ్ చేసుకున్నవాళ్లు మాత్రం చాల తక్కువమందే. అయితే మోనల్ మాత్రం బిగ్ బాస్ వల్ల వచ్చిన క్రేజ్ తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఈ సీజన్‌కి వెళ్లిన వారిలో దివికి కూడా మంచి క్రేజ్ వచ్చింది. కానీ, ఆమె హీరోయిన్‌గా అవకాశాలు కావాలంటూ వచ్చిన అవకాశాలను వదులుకుంటుంది. అలాగే మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. గత […]

Written By:
  • admin
  • , Updated On : January 2, 2021 / 10:06 AM IST
    Follow us on


    బిగ్‌ బాస్ షోకి వెళ్లి ముందు మంచి పాపులారిటీ తెచ్చుకున్నా.. ఆ తర్వాత ఆ క్రేజ్ తో కెరీర్ బిల్డ్ చేసుకున్నవాళ్లు మాత్రం చాల తక్కువమందే. అయితే మోనల్ మాత్రం బిగ్ బాస్ వల్ల వచ్చిన క్రేజ్ తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఈ సీజన్‌కి వెళ్లిన వారిలో దివికి కూడా మంచి క్రేజ్ వచ్చింది. కానీ, ఆమె హీరోయిన్‌గా అవకాశాలు కావాలంటూ వచ్చిన అవకాశాలను వదులుకుంటుంది. అలాగే మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. గత సీజన్స్ లోనూ చాలామంది దివిలానే భారీగా ఆశించి.. చివరకు ఎటు కాకుండా పోయారు.

    Also Read: వైరల్ పిక్స్: న్యూ ఇయర్ రోజున ఆ ఇద్దరితో మోనాల్ ఎంజాయ్

    అయితే మోనాల్ మాత్రం ఈ విషయంలో చాల తెలివిగా ముందుకు పోతుంది. తనకు ఆల్రెడీ హీరోయిన్ ఇమేజ్ ఉన్నా.. మళ్ళీ హీరోయిన్ క్యారెక్టర్లు వస్తేనే చేస్తానంటూ మోనల్ ఒక పరిధి పెట్టుకోలేదు. డబ్బులు ఇస్తే ఎలాంటి పాత్ర అయినా చేస్తానంటూ ముందుకుపోతుంది. ఇప్పటికే ఐటెమ్ సాంగుల నుంచి, టీవీ షోల వరకూ ఏది వదిలిపెట్టకుండా వచ్చిన క్రేజ్ ను ఫుల్ గా క్యాష్ చేసుకుంటుంది. ఎంతైనా ఈ బిగ్‌బాస్ క్రేజ్ త్వరలో చల్లారిపోతుంది కాబట్టి.. ఆ క్రేజ్ పోకముందే మోనల్ సంపాదనలో పడింది.

    Also Read: అందరికీ షాకిచ్చిన స్టార్ హీరోయిన్

    ఇప్పటికే మోనాల్‌కి స్టార్ మాలో ఓ షో చేస్తోంది, అలాగే బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఓ స్పెష‌ల్ సాంగ్‌లో కూడా మోనాల్‌ ఆడిపాడింది. సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా కోసం చాలా మంది బిగ్ బాస్ ఫ్యాన్స్ వేచి చూస్తున్నారట. అందుకే మోనాల్ కి, ఈ సాంగ్ కోసం భారీగానే ముట్టజెప్పారు. ఇక నితిన్ సినిమాలోనూ మోనాల్ ఓ స్పెషల్ క్యారెక్టర్ చేస్తోంది. మల్లెమాల వారు కూడా మోనాల్ కి మధ్యాహ్నం వచ్చే ఒక షోలో జడ్జిగా తీసుకున్నారని టాక్ నడుస్తోంది. అలాగే మోనాల్ చేతిలో మరో రెండు మూడు చిన్నాచితకా సినిమాలు కూడా ఉన్నాయట. మొత్తానికి వచ్చిన క్రేజ్ ను బాగా క్యాష్ చేసుకుంటుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్