https://oktelugu.com/

భార్య పుట్టినరోజు జరిపేందుకు మహేష్ బాబు ఎక్కడికి తీసుకెళ్తున్నాడంటే?

టాలీవుడ్ లో హిట్ పెయిర్ ఎవరయ్యా అంటే అందరూ మహేష్-నమ్రతనే సూచిస్తుంటారు. వీరిద్దరూ అనోన్యమైన జంటగా పేరుతెచ్చుకున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కంటే ఆయన భార్య నమ్రతా ఒక సంవత్సరం పెద్దది. నమ్రత పుట్టినరోజు రేపే. రేపు (జనవరి 22)న ఆమె బర్త్ డే వేడుకలు ఘనంగా జరుపుకోవడానికి మహేష్ బాబు.. తన భార్య పిల్లలను దుబాయ్ తీసువెళ్ళాడు. Also Read: పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ఎందుకు నేర్చుకున్నాడో తెలుసా..? “వంశీ” చిత్రీకరణ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 21, 2021 / 10:51 PM IST
    Follow us on

    టాలీవుడ్ లో హిట్ పెయిర్ ఎవరయ్యా అంటే అందరూ మహేష్-నమ్రతనే సూచిస్తుంటారు. వీరిద్దరూ అనోన్యమైన జంటగా పేరుతెచ్చుకున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కంటే ఆయన భార్య నమ్రతా ఒక సంవత్సరం పెద్దది. నమ్రత పుట్టినరోజు రేపే. రేపు (జనవరి 22)న ఆమె బర్త్ డే వేడుకలు ఘనంగా జరుపుకోవడానికి మహేష్ బాబు.. తన భార్య పిల్లలను దుబాయ్ తీసువెళ్ళాడు.

    Also Read: పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ఎందుకు నేర్చుకున్నాడో తెలుసా..?

    “వంశీ” చిత్రీకరణ సమయంలో మహేష్ బాబు-నమ్రతలు ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ 2005లో వివాహం చేసుకున్నారు. నమ్రత -మహేష్ బాబు కంటే ఒక సంవత్సరం పెద్దదైనా సరే వీరి సంసారం ఇప్పటిదాకా అరమరికలు లేకుండా సాగుతోంది.

    ఇటీవల మహేష్ బాబు – అతని కుటుంబం దుబాయ్‌కి ఎంజాయ్ చేయడానికి క్రమం తప్పకుండా వెళుతోంది. కానీ ఈ విషయం బయటకు పొక్కడం లేదు. గోప్యత పాటిస్తున్నారు.

    Also Read: వర్షిణితో అభిజీత్.. హైపర్ ఆదికి వార్నింగ్ అందుకే ఇచ్చాడా?

    మహేష్ బాబు త్వరలో దుబాయ్‌లో “సర్కారు వారీ పాట” మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. రెగ్యులర్ షూట్ జనవరి 29న లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభమవుతుంది.

    దర్శకుడు పరశురాం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసి షూట్ ప్రారంభించడానికి రెడీగా ఉన్నాడు.. కీర్తి సురేష్ కథానాయిక. ఈ క్రమంలోనే నమ్రత బర్త్ డేను కూడా దుబాయ్ లో జరిపేందుకు మహేష్ బాబు రెడీ అయ్యి ఫ్యామిలీని తీసుకెళుతున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్