https://oktelugu.com/

కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారా.. తినాల్సిన ఆహార పదార్థాలివే..?

దేశంలో ఒకవైపు కరోనా కేసుల సంఖ్య, కరోనా మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంటే మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ అంతే వేగంగా జరుగుతోంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత జ్వరం, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి లాంటి లక్షణాలు కొంతమందిలో కనిపిస్తున్నాయి. కొంతమందిలో మాత్రం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించడం లేదు. అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లు సైడ్ ఎఫెక్ట్స్ వల్ల టెన్షన్ పడుతున్నారు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సరైన ఆహారం తీసుకోవడం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 11, 2021 / 01:26 PM IST
    Follow us on

    దేశంలో ఒకవైపు కరోనా కేసుల సంఖ్య, కరోనా మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంటే మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ అంతే వేగంగా జరుగుతోంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత జ్వరం, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి లాంటి లక్షణాలు కొంతమందిలో కనిపిస్తున్నాయి. కొంతమందిలో మాత్రం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించడం లేదు. అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లు సైడ్ ఎఫెక్ట్స్ వల్ల టెన్షన్ పడుతున్నారు.

    సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సరైన ఆహారం తీసుకోవడం ద్వారా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత వచ్చే ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని తెలిపింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఇమ్యూనిటీ పవర్ ను పెంచే, నీళ్లు అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. సూప్స్ ను ఎక్కువగా తీసుకుంటే మంచిదని వైద్యులు వెల్లడిస్తున్నారు.

    మాంసం తినే వాళ్లు చికెన్, బోన్ సూప్స్ తీసుకుంటే త్వరగా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. నాన్ వెజ్ తినని వాళ్లు ఆలుగడ్డలు, బ్రకోలి, కాయధాన్యాలను తీసుకుంటే మంచిది. మరోవైపు 45 సంవత్సరాల వయస్సు పైబడిన వారంతా వ్యాక్సిన్ వేయించుకునేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. వైద్యులు, సిబ్బంది సెలవులు తీసుకోకుండా వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియకు హాజరవుతూ ఉండటం గమనార్హం.

    కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో లాక్ డౌన్ ను అమలు చేయకపోయినా కఠినంగా ఆంక్షలు అమలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి.