https://oktelugu.com/

టీఆర్‌‌ఎస్‌ వల్లే బీజేపీ గెలిచిందా..!

దుబ్బాక నియోజకవర్గం ఏర్పాటు నుంచి ఆ స్థానం టీఆర్‌‌ఎస్‌కు కంచుకోటనే. అదే ధీమాతో ఈసారి ఉప ఎన్నిక పోరుకు దిగింది టీఆర్‌‌ఎస్‌ పార్టీ. కానీ.. ఒక్కసారిగా అంచనాలు తలకిందులయ్యాయి. ఎవరూ ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ ఈ ఉప ఎన్నికలో విజయ దుందుభి మోగించింది. ఇక్కడ బీజేపీ గెలుపునకు కారణంగా ఒక విధంగా చెప్పాలంటే అది టీఆర్‌‌ఎస్‌ పార్టీనే. Also Read: దుబ్బాక గడ్డ.. ఇప్పుడు రఘన్న అడ్డా ఎలాగూ తమదే కదా సీటు.. అందులోనూ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 11, 2020 / 05:05 AM IST
    Follow us on

    దుబ్బాక నియోజకవర్గం ఏర్పాటు నుంచి ఆ స్థానం టీఆర్‌‌ఎస్‌కు కంచుకోటనే. అదే ధీమాతో ఈసారి ఉప ఎన్నిక పోరుకు దిగింది టీఆర్‌‌ఎస్‌ పార్టీ. కానీ.. ఒక్కసారిగా అంచనాలు తలకిందులయ్యాయి. ఎవరూ ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ ఈ ఉప ఎన్నికలో విజయ దుందుభి మోగించింది. ఇక్కడ బీజేపీ గెలుపునకు కారణంగా ఒక విధంగా చెప్పాలంటే అది టీఆర్‌‌ఎస్‌ పార్టీనే.

    Also Read: దుబ్బాక గడ్డ.. ఇప్పుడు రఘన్న అడ్డా

    ఎలాగూ తమదే కదా సీటు.. అందులోనూ సిట్టింగ్‌ సీటు అని మితిమీరిన ఆత్మవిశ్వాసం.. లాజిక్ లేని వ్యూహంతో టీఆర్ఎస్ దారుణంగా దెబ్బతిన్నది. బీజేపీ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. దుబ్బాక అసెంబ్లీకి ఉపఎన్నిక వచ్చినప్పుడు అక్కడ పార్టీల స్థితిగతులను అంచనా వేసిన తర్వాత టీఆర్ఎస్‌కు తిరుగులేదని అందరూ నిర్ణయించుకున్నారు.

    కానీ.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక టీఆర్ఎస్ తప్పులు చేసింది. చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో ఓట్ల చీలిక వ్యూహం పాటించింది. ఆ ప్రకారం బీజేపీ అభ్యర్థికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారు. ఎంతగా అంటే రఘునందన్ పై పూర్తి స్థాయిలో నిఘా పెట్టి ఆయన ఏం చేసినా తెలుసుకుని ఎన్నికల వ్యూహాలను చెల్లాచెదురు చేసేంతగా వ్యూహం పన్నారు.

    మొదట్లోనే హైదరాబాద్ శివార్లలో డబ్బులు పట్టుకున్నారు. అవి పంచడానికే తీసుకెళ్తున్నారని పోలీసులతో స్టేట్‌మెంట్ ఇప్పించారు. అప్పటి నుంచి టార్గెట్ రఘునందన్ అంటూ రాజకీయాలు నడిపించింది టీఆర్‌‌ఎస్‌ పార్టీ. మూడు సార్లు డబ్బులు పట్టుబడ్డాయి. అయితే.. ఇవన్నీ రఘునందన్ పై ప్రజల్లో సానుభూతిని పెంచాయి. రఘునందన్‌నే ప్రధాన ప్రత్యర్థి అనే పరిస్థితిని టీఆర్ఎస్ తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ సంప్రదాయక ఓట్లు.. చెరుకు కుటుంబంపై ఉన్న అభిమానం.. ఇప్పుడు బీజేపీని ప్రత్యర్థిగా రూపొందించడం వల్ల ఓట్లు మొత్తం మూడు పార్టీల మధ్య చీలిపోతాయని తమకు భారీ మెజార్టీ వస్తుందని టీఆర్ఎస్ వ్యూహకర్తలు అంచనా వేశారు.

    Also Read: ఓటమికి కారణం అదే: టీఆర్‌‌ఎస్‌ ఓట్లు చీల్చింది ఆ ‘చపాతీ’

    మరోవైపు ఎన్నికలు తన భుజస్కంధాలపై వేసుకున్న ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఇదే అనుకున్నారు. కానీ.. బీజేపీని ఎలా టార్గెట్ చేద్దామనుకున్నారో అదే ఆ పార్టీకి ప్లస్‌ అయింది. గెలుపును సాధించిపెట్టింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను టార్గెట్ చేసి పక్కాగా ప్రచారం చేసింది. 60 వేల మందికిపైగా ఉన్న సామాజిక పెన్షన్లు పొందేవారు.. రైతు భరోసా పొందుతున్న వారితో పాటు.. ప్రత్యేకంగా జీవో ఇచ్చి మరీ ఎన్నికలకు ముందే.. బీడీ కార్మికులకు పెన్షన్లు మంజూరు చేశారు. అందుకే ఎలా చూసినా లక్ష ఓట్లు తమకు వస్తాయని టీఆర్ఎస్ నేతలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ.. కేంద్రంలోని అధికారాన్ని తమకు అనుకూలంగా మలచుకోవడంలో బీజేపీ సక్సెస్‌ అయిందని చెప్పాలి.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    టీఆర్ఎస్ ఇస్తున్న పథకాలు మొత్తం కేంద్ర నిధులతో ఇస్తున్నవేనని ప్రచారం చేశారు. దీనిపై ఏకంగా సీఎం కూడా స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న పథకాల్లో కేంద్రం నిధులు ఉన్నాయని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. ఇది కాస్త మరింత చర్చకు దారితీసింది. ఏ విధంగా చూసినా ఎన్నికల ప్రారంభం నుంచి టీఆర్‌‌ఎస్‌ పార్టీనే బీజేపీకి అన్ని విధాలా ప్రచారం కల్పించినట్లుగా చెప్పొచ్చు. టీఆర్‌‌ఎస్‌ చేసిన అత్యుత్సాహం వల్లే బీజేపీకి ప్రజల్లో సానుభూతి పెరిగిందనీ చెప్పొచ్చు. ఫైనల్‌గా గెలుపు బావుటా ఎగురవేశారనేది స్పష్టం.