టీఆర్‌‌ఎస్‌ను దెబ్బతీసిన సోషల్‌ మీడియా

దుబ్బాక ఉప ఎన్నికల ముందు వరకు కూడా టీఆర్‌‌ఎస్‌కు కాంగ్రెస్‌ పార్టీనే ప్రధాన ప్రత్యర్థి అని అందరూ అనుకున్నారు. బీజేపీ ఎక్కడో మూడో స్థానానికి పరిమితం అవుతుందని అందరూ భావించారు. కానీ.. అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించి సంచలనం సృష్టించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతీ ఎన్నికలోనూ విజయబావుటా ఎగురవేస్తున్న టీఆర్‌‌ఎస్‌కు ముచ్చెమటలు పుట్టించి మట్టి కరిపించాడు. ఇక ఇప్పుడు అధికార పార్టీ ఓటమిపై విశ్లేషణలు మొదలయ్యాయి. ప్రధానంగా సోషల్‌ […]

Written By: NARESH, Updated On : November 11, 2020 11:10 am
Follow us on

దుబ్బాక ఉప ఎన్నికల ముందు వరకు కూడా టీఆర్‌‌ఎస్‌కు కాంగ్రెస్‌ పార్టీనే ప్రధాన ప్రత్యర్థి అని అందరూ అనుకున్నారు. బీజేపీ ఎక్కడో మూడో స్థానానికి పరిమితం అవుతుందని అందరూ భావించారు. కానీ.. అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించి సంచలనం సృష్టించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతీ ఎన్నికలోనూ విజయబావుటా ఎగురవేస్తున్న టీఆర్‌‌ఎస్‌కు ముచ్చెమటలు పుట్టించి మట్టి కరిపించాడు. ఇక ఇప్పుడు అధికార పార్టీ ఓటమిపై విశ్లేషణలు మొదలయ్యాయి. ప్రధానంగా సోషల్‌ మీడియా వల్లనే టీఆర్‌‌ఎస్‌ పార్టీ ఓటమిని చవిచూసిందని ప్రముఖ విశ్లేషకులు చెప్పుకొచ్చారు.

Also Read: టీఆర్‌‌ఎస్‌ వల్లే బీజేపీ గెలిచిందా..!

2014లో టీఆర్‌‌ఎస్‌ పార్టీ మొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ కొత్తలో కొన్ని చానల్స్ ఆ పార్టీని, కేసీఆర్‌‌ను పెద్దగా ఖాతరు చేయలేదు. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొద్ది నెలలకే అలాంటి చానల్స్ మెడలు వంచడంలో కేసీఆర్‌‌ సక్సెస్‌ అయ్యారు. ఆ తర్వాత కొంత కాలానికి హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే చానల్స్ చాలా వరకు కేసీఆర్ భజన మొదలుపెట్టాయి. టీఆర్ఎస్ పార్టీ ఏం చేసినా అది కరెక్టే అనే స్థాయికి చాలా వరకు అగ్రచానల్స్ మారాల్సి వచ్చింది. కేసీఆర్ చేసే మంచి పనులను ఆకాశానికి ఎత్తి, ఆయన చేసే పొరపాట్లను మరుగు పరిచే విధంగా చానల్స్ మారిపోయాయని సామాన్య ప్రజల్లో కూడా ఓ భావన వచ్చింది. కొన్ని అగ్ర చానల్స్‌ను మరీ బలవంతంగా కేసీఆర్‌‌ సన్నిహితుల తమ చేతుల్లోకి తీసేసుకున్నారు.

Also Read: దుబ్బాక ఫలితం: హరీశ్ రావు భవితవ్యం పై తీవ్ర చర్చ..

కనీసం ఒక్కటంటే ఒక్క చానల్ కూడా కేసీఆర్ పొరపాట్లను, ప్రజల్లో అప్పుడప్పుడు వ్యక్తమయ్యే వ్యతిరేక భావనలను చూపకపోవడంతో, తెలంగాణ ప్రజలు సోషల్ మీడియా వైపు మొగ్గు చూపినట్లుగా అర్థం అవుతోంది. ఎన్నికల ముందు ఏ చానల్ చూసినా 80 శాతం స్క్రోలింగ్ టీఆర్ఎస్ నాయకులు చేసే వ్యాఖ్యలకు కేటాయిస్తే, కేవలం 20 శాతం స్క్రీన్ స్పేస్ మాత్రమే మిగతా అన్ని పార్టీల నాయకులకు కలిపి కేటాయించినట్లు కనిపిస్తోంది.

అంతేకాకుండా బీజేపీ నేత ఇంట్లో డబ్బులు దొరికాయి అన్న వ్యవహారంలో కూడా తెలుగు న్యూస్ చానల్స్ ఒకదానికొకటి పోటీ పడి అధికార పార్టీ వాణి వినిపించాయి. మరో వైపు సోషల్ మీడియాలో మాత్రం దీనికి పూర్తి భిన్నమైన వాతావరణం కనిపించింది. అధికార పార్టీకి చెందిన నేతలు చేసే దురుసు వ్యాఖ్యలు, పొరపాటు పనులు ఇవన్నీ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. దీంతో తమకు న్యూస్ ఛానల్స్ బలం లేదని చెప్పుకునే బీజేపీ కూడా సోషల్ మీడియాను బలంగా వినియోగించుకోవడంపై దృష్టి సారించింది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ తరఫున బలమైన నాయకుడిగా ఉన్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్‌లు సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలు అధికార పార్టీకి వంతపాడే న్యూస్ చానల్స్ ఏమాత్రం కవర్ చేయకపోయినా, అవి ప్రజల్లోకి వెళ్లాయి అంటే అది కేవలం సోషల్ మీడియా కారణంగానే. మొత్తానికి వందల కోట్లు పెట్టి చానల్స్‌ను కొనుక్కున్నా కూడా, అవసరానికి ఆ చానల్స్ తమ పార్టీ గెలుపునకు సహాయపడ లేకపోయాయి అన్న విషయాన్ని టీఆర్ఎస్ నేతలు కూడా పరోక్షంగా ఒప్పుకున్నట్లే అయింది.