Ram Charan leaks Peddi interval scene: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) హీరో గా నటిస్తున్న ‘పెద్ది'(Peddi Movie) చిత్రం పై ప్రేక్షకుల్లో , అభిమానుల్లో అంచనాలు వేరే లెవెల్ లో ఉన్నాయి. ఈ చిత్రం నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రతీ ఒక్కటి కూడా అభిమానులకు మెంటలెక్కిపోయేలా చేస్తోంది. ఒక సినిమా ఎలా ఉండబోతుంది అనేది , కేవలం ఆ సినిమా తాలూకు ప్రమోషనల్ కంటెంట్ ని చూసి చెప్పేయొచ్చు. ఈ సినిమాలో అలాంటి కంటెంట్ ఇప్పటికే బోలెడంత బయటకు వచ్చేసింది. గ్లింప్స్ వీడియో నే పెద్ద హిట్ అనుకుంటే, ‘చికిరి ..చికిరి ‘ పాట గ్లోబల్ వైడ్ గా పెద్ద సెన్సేషన్ సృష్టించింది. నేడు ఈ చిత్రం నుండి రెండవ పాట విడుదల కాబోతుంది. ‘రయ్..రయ్’ అనే లిరిక్స్ తో సాగే ఈ పాట ‘చికిరి చికిరి’ ని మించే విధంగా ఉంటుందని అంటున్నారు.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలను రామ్ చరణ్ నిన్ననే మొదలు పెట్టాడు. ఈ సందర్భంగా ఆయన తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా విడుదల చేసిన వీడియో కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ వీడియో లో రామ్ చరణ్ మానిటర్ లో కనిపిస్తున్న షాట్ కి డబ్బింగ్ చెప్పడానికి రెడీ అవ్వడం , అప్పుడు డైరెక్టర్ బుచ్చి బాబు షాట్ రెడీ సార్ అనడం , అప్పుడు రామ్ చరణ్ ‘ఏమది’ అంటూ డైలాగ్ చెప్పడం హైలైట్ గా నిల్చింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ, రామ్ చరణ్ డైలాగ్ చెప్తున్న షాట్ టైం స్టాంప్ కూడా ఆ వీడియో లో ఉండడం తో , రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇది ఇంటర్వెల్ సన్నివేశం అన్నమాట అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.
ఈ టైం స్టాంప్ ని బాగా గమనిస్తే 1:22 గంటలు ఉన్నట్టు తెలుస్తోంది. ఏ సినిమాలో అయినా ఇంటర్వెల్ సన్నివేశం వచ్చేది కరెక్ట్ గా ఈ టైం స్టాంప్ దగ్గరే . దీంతో రామ్ చరణ్ ఈ సినిమా లో ఇంటర్వెల్ సన్నివేశం ఎలా ఉండబోతుందో లీక్ చేసేశాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంటర్వెల్ అంటే కచ్చితంగా ఎదో ఒక ఫైట్ సన్నివేశం , లేదా భారీ ట్విస్ట్ ఉండే సన్నివేశం పెడుతారు కానీ, ఇక్కడ చూస్తుంటే చాలా నార్మల్ సన్నివేశం లాగా ఉండే ?, క్లిక్ అవ్వుద్ధో లేదో అనే భయం అభిమానుల్లో ఉంది. కానీ ఈ సన్నివేశం ప్రీ ఇంటర్వెల్ కూడా అయ్యుండొచ్చు కదా ? అని మరికొందరు అంటున్నారు. మరి ఎలాంటి ఇంటర్వెల్ డైరెక్టర్ ప్లాన్ చేశాడు అనేది తెలియాలంటే ఏప్రిల్ 30 వరకు ఆగాల్సిందే.