https://oktelugu.com/

వైరల్ వీడియో: నవీన్ పోలిశెట్టిపై రాహుల్ రామకృష్ణ ఆగ్రహం

‘జాతిరత్నాలు’ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన బృందం ఇప్పుడు ప్రమోషన్ బాటలో పడింది. అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శిలు సందడి చేస్తున్నారు. న్యూజెర్సీలో జరిగిన సక్సెస్ టూర్ కు సంబంధించిన ఓ స్పెషల్ వీడియోని చిత్ర నిర్మాణ సంస్థ స్వప్నా సినిమాస్ అభిమానులతో పంచుకుంది. కాగా ఈ వీడియో చూసిన రాహుల్.. తనను తీసుకెళ్లకుండా నవీన్, ప్రియదర్శి అమెరికాకు వెళ్లడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓ సరదా వీడియోను విడుదల చేశారు. ఇటీవల శుక్రవారం […]

Written By:
  • NARESH
  • , Updated On : March 21, 2021 / 01:16 PM IST
    Follow us on

    ‘జాతిరత్నాలు’ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన బృందం ఇప్పుడు ప్రమోషన్ బాటలో పడింది. అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శిలు సందడి చేస్తున్నారు. న్యూజెర్సీలో జరిగిన సక్సెస్ టూర్ కు సంబంధించిన ఓ స్పెషల్ వీడియోని చిత్ర నిర్మాణ సంస్థ స్వప్నా సినిమాస్ అభిమానులతో పంచుకుంది. కాగా ఈ వీడియో చూసిన రాహుల్.. తనను తీసుకెళ్లకుండా నవీన్, ప్రియదర్శి అమెరికాకు వెళ్లడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓ సరదా వీడియోను విడుదల చేశారు.

    ఇటీవల శుక్రవారం విడుదలైన సినిమాలు సరిగా హిట్ టాక్ రాకపోవడం జాతిరత్నాలు మూవీకి మరింత బూస్ట్ వచ్చింది. మరో వారం పాటు ఈ చిత్రం కలెక్షన్లకు ఢోకా లేకుండా పోయింది.

    తాజాగా రాహుల్ రామకృష్ణ సంచలన వీడియోను రిలీజ్ చేశారు. హీరో నవీన్ పోలిశెట్టిపై నటుడు రాహుల్ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.నవీన్ కు వార్నింగ్ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో వైరల్ అయ్యింది.

    ‘ఆరేయ్ దర్శి, నవీన్.. పీపుల్స్ ప్లాజాలో సక్సెస్ మీట్ అయ్యాక.. మిమ్మల్ని కలిసేలోపే సాప్ పోర్టుతో ఎయిర్ పోర్టుకు వెళ్లి విమానమెక్కి యూఎస్ వెళ్లిపోతారేరా.. నేను చెప్పా కదరా.. నా దగ్గర కూడా నా దగ్గర పాన్ కార్డ్ ఉందని.. జోగిపేట రవిరా నేను.. నా వల్ల ప్రాబ్లం అవుతుందని వదిలేసి వెళ్లిపోయారు కదారా.. మీరు రండ్రా. మీ సంగతి చెబుతా’ అంటూ రాహుల్ చేసిన సరదా వీడియో నవ్వులు పూయిస్తోంది. ఈ వీడియోను షేర్ చేస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రాహుల్ ను వదిలి ప్రియదర్శి, నవీన్ అమెరికా వెళ్లడంతో ఈ ఆగ్రహం వ్యక్తమైనట్టు తెలుస్తోంది.