ఉద్యోగులు, పెన్షనర్లకు మోదీ సర్కార్ శుభవార్త..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరేలా అదిరిపోయే శుభవార్త చెప్పింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు జులై 1వ తేదీ నుంచి డియర్ నెస్ అలవెన్స్ పొందుతారని వెల్లడించారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు ఊరట కలిగేలా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న వకీల్ సాబ్ మూడు ఇన్ స్టాల్ మెంట్ల డబ్బును […]

Written By: Navya, Updated On : April 10, 2021 8:48 am
Follow us on

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరేలా అదిరిపోయే శుభవార్త చెప్పింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు జులై 1వ తేదీ నుంచి డియర్ నెస్ అలవెన్స్ పొందుతారని వెల్లడించారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు ఊరట కలిగేలా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న వకీల్ సాబ్ మూడు ఇన్ స్టాల్ మెంట్ల డబ్బును నిలుపుదల చేయగా పెండింగ్‌లో ఉన్న మూడు ఇన్‌స్టాల్‌మెంట్ల డీఏని పొందుతారని ఆయన అన్నారు. 2021 జూలై 1 నుంచి పెండింగ్ లో ఉన్న డీఏ ఉద్యోగులు, పెన్షనర్లకు అందనుండగా కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల 65 లక్షల మంది పెన్షనర్లకు, 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 17 శాతం డియర్ నెస్ ఆలవెన్స్ ఉంది. కేంద్ర కేబినెట్ ఈ ఏడాది 4 శాతం డీఏ పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 2020 జనవరి 1 నుంచి డీఏ పెంపు అమలు కావాల్సి ఉండగా కరోనా విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల వల్ల డీఏ పెంపు విషయంలో కేంద్రం వెనక్కు తగ్గింది. జులై నుంచి డీఏ పెంపు అమలులోకి వస్తుండటంతో ఉద్యోగులకు వేతనాలు పెరగనున్నాయి.

డీఏ పెరుగుదల కారణంగా హెచ్ఆర్‌ఏ, ట్రావెల్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్ లో మార్పులు ఉంటాయి. డీఏ పెంపు వల్ల వేతనాలు పెరుతున్నాయనే వార్తలపై ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.