మావోల వ్యూహం.. జవాన్ విడుదలకు కారణం ఇదే..?

దెబ్బతిన్న పులి వేటకు మరిగినట్లు.. మావోయిస్టులు మరో భారీ విధ్వంసానికి పథకం రచిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పోలీసులు వందలాది మంది అమాకయ ప్రజలు, తమ సభ్యులను బలితీసుకున్నారని.. అయితే పోలీసులంటే తమకు కోపం లేదని.. కేవలం ప్రజాస్వామ్యంలో ప్రజలకు అందే హక్కుల గురించి తమ పోరాటం సాగుతుందని ఇటీవలే మావోయిస్టులు ప్రకటించారు. అందివస్తున్న టెక్నాలజీ దేశంలో మావోల పతనానికి కారణం అవుతోంది. గతం కన్నా ప్రస్తుతం వారికి భారీగానే నష్టం వాటిల్లుతోంది. ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు మావోయిస్టులో […]

Written By: Srinivas, Updated On : April 10, 2021 8:49 am
Follow us on


దెబ్బతిన్న పులి వేటకు మరిగినట్లు.. మావోయిస్టులు మరో భారీ విధ్వంసానికి పథకం రచిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పోలీసులు వందలాది మంది అమాకయ ప్రజలు, తమ సభ్యులను బలితీసుకున్నారని.. అయితే పోలీసులంటే తమకు కోపం లేదని.. కేవలం ప్రజాస్వామ్యంలో ప్రజలకు అందే హక్కుల గురించి తమ పోరాటం సాగుతుందని ఇటీవలే మావోయిస్టులు ప్రకటించారు. అందివస్తున్న టెక్నాలజీ దేశంలో మావోల పతనానికి కారణం అవుతోంది. గతం కన్నా ప్రస్తుతం వారికి భారీగానే నష్టం వాటిల్లుతోంది. ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు మావోయిస్టులో భారీ స్కెచ్ వేసినట్ల సమాచారం. ఇందులో భాగంగానే చత్తీస్ ఘఢ్లోని బీజాపూర్లో ఏప్రిల్ 3న సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడిచేసి.. కిడ్నాప్ చేసిన జవాన్ రాకేశ్వర్ సింగ్ ను మావోయిస్టులు ఎట్టకేలకు విడుదల చేశారు.

రాకేశ్వర్ సింగ్ ను కిడ్నాప్ చేసిన పోలీసులు ఆరురోజులు తమ చెరలో ఉంచుకున్నారు. మొదటి నుంచి అతడి విషయంలో సానుకూల ధోరణితోనే వ్యవహరించారు. అతడి ప్రాణానికి ఎలాంటి హాని తలపెట్టబోమని, ప్రభుత్వం వెంటనే చర్చలు ప్రారంభించాలని.. మధ్యవర్తిత్వం వహించే వారిపేర్లు ప్రకటిస్తే… రాకేశ్వర్ ను విడుదల చేస్తామని ప్రకటించారు. బుధవారం మధ్యాహ్నం ఓ పాకలో ఏవిధమైన ఆందోళన లేకుండా కూర్చున్న రాకేశ్వర్ చిత్రాన్ని విడుదల చేశారు. అనూహ్యంగా గురువారం మధ్యాహ్నం రాకేశ్వర్ సింగ్ ను విడుదల చేశారు.

అయితే మావోలకు బంధీగా చిక్కిన జవాన్ ను వారు ఇంత త్వరగా ఎందుకు విడుదల చేశారన్న ఆలోచన ప్రతీఒక్కరిలో వస్తోంది. చత్తీస్ గఢ్ పోలీసులు.. ప్రభుత్వం ఏం చేశారన్నది ఆసక్తికరంగా మారింది. మావోలు ప్రభుత్వ అధికారులను కిడ్నాప్ చేయడం.. తమ డిమాండ్లను నెరవేర్చుకోవడం.. కొత్త విషయం ఏమీ కాదు. దశాబ్దకాలంగా జరుగుతున్నదే ఇప్పుడు జరిగింది. అయితే తెరవెనుక మావోలకు ప్రభుత్వం నుంచి ఏమైనా హామీలు లభించాయా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

గతంలోనూ మావోయిస్టు అగ్రనేత ఆర్కేను పోలీసులు అరెస్టు చేశారు. అతడి విడుదల కోసం చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని మల్కన్ గిరి జిల్లా కలెక్టర్ వినీల్ కృష్ణను 2011లో మావోలు కిడ్నాప్ చేశారు. జేడీ పబిత్రా మోహన్తో కలిసి బైక్ పై వెళ్తుండగా.. దారికాచి ఎత్తుకెళ్లారు. ఏపీ నుంచి పలువురు పౌరహక్కుల నేతలు మధ్యవర్తిత్వం వహించి వారిని విడుదల చేయించారు. అయితే బయటికి ప్రపంచానికి మాత్రం పోలీసులు గిరిజనులను అరెస్టు చేశారని.. వారి విడుదల కోసమే.. కిడ్నాప్ లు చేశారని అంతా అనుకున్నారు. ప్రస్తుతం కూడా అదే పంథాలో వెళ్తున్న మావోలు ఏం విధ్వంసాలకు తెర లేపుతారో వేచిచూడాలి.