కరోనా వ్యాక్సిన్ ను తీసుకుంటే సంతాన సమస్యలు వస్తాయా..?

దేశంలో కరోనా మహమ్మారికి చెక్ పెట్టే కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జరిగింది. మన దేశంలోనే తయారైన కోవీషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లను ఇప్పటికే వైద్య నిపుణులు, హెల్త్ అసిస్టెంట్లు తీసుకోగా ప్రస్తుతం 60 సంవత్సరాల వయస్సు పైబడిన వారితో పాటు 45 సంవత్సరాల వయస్సు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవాళ్లకు వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జరుగుతోంది. అయితే కరోనా వ్యాక్సిన్ కు […]

Written By: Kusuma Aggunna, Updated On : March 21, 2021 7:31 pm
Follow us on

దేశంలో కరోనా మహమ్మారికి చెక్ పెట్టే కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జరిగింది. మన దేశంలోనే తయారైన కోవీషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లను ఇప్పటికే వైద్య నిపుణులు, హెల్త్ అసిస్టెంట్లు తీసుకోగా ప్రస్తుతం 60 సంవత్సరాల వయస్సు పైబడిన వారితో పాటు 45 సంవత్సరాల వయస్సు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవాళ్లకు వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జరుగుతోంది.

అయితే కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు వైరల్ అవుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ ను తీసుకుంటే సంతాన సమస్యలు వస్తాయని వైరల్ అవుతున్న ఆ వార్త సారాంశం. అయితే మన దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లలో ఎక్కువ మందికి ఎలాంటి సైడ్ ఎఫెక్టులు కనిపించలేదు. వ్యాక్సిన్లు ప్రభావవంతంగా పని చేస్తుండటంతో రెండో విడత వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ వేగంగా జరుగుతోంది.

కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ వీక్ అవుతుందని ప్రచారం జరుగుతుండగా ఆ వార్తలో కూడా ఎలాంటి నిజం లేదు. ఇప్పటికే కరోనా సోకిన వాళ్లు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో కూడా నిజం లేకపోవడం గమనార్హం. వ్యాక్సిన్ తీసుకోవాలని అనుకునే వాళ్లు ఎటువంటి సందేహం అవసరం లేకుండా కరోనా వ్యాక్సిన్ ను తీసుకోవచ్చు.

కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని చాలామంది భావిస్తున్నారు. వ్యాక్సినేషన్ ఆరంభ దశలోనే ఉండటంతో వ్యాక్సిన్ తీసుకునే వాళ్లు తప్పనిసరిగా మాస్క్ వేసుకుంటే మంచిది.