https://oktelugu.com/

కళ్లలో నీళ్లు తిరుగుతున్న వేళ రానా గురించి వెంకటేశ్ ఏమన్నాడంటే?

తన అన్న కొడుకు రానా గురించి చెబుతూ అగ్రహీరో వెంకటేశ్ ఎమోషనల్ అయ్యాడు. కళ్లలో నీళ్లు తిరుగుతున్న వేళ భావోద్వేగానికి గురయ్యాడు.. ‘లీడర్ ’ నుంచి కృష్ణం వందే జగద్గురం, బాహుబలి దాకా రానా ప్రయాణం చూస్తే కొంచెం బాగా చేస్తున్నాడని అనిపించిందని.. కానీ తాజాగా అరణ్య సినిమా చూశాక రానా నాకే పోటీగా మారాడని అనిపించిందని అగ్రహీరో వెంకటేశ్ తాజాగా భావోద్వేగానికి గురయ్యాడు. కళ్లలో నీళ్లు తిరుగుతున్న వేళ రానా యాక్టింగ్ గురించి తలుచుకొని వెంకటేశ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 21, 2021 / 07:41 PM IST
    Follow us on

    తన అన్న కొడుకు రానా గురించి చెబుతూ అగ్రహీరో వెంకటేశ్ ఎమోషనల్ అయ్యాడు. కళ్లలో నీళ్లు తిరుగుతున్న వేళ భావోద్వేగానికి గురయ్యాడు.. ‘లీడర్ ’ నుంచి కృష్ణం వందే జగద్గురం, బాహుబలి దాకా రానా ప్రయాణం చూస్తే కొంచెం బాగా చేస్తున్నాడని అనిపించిందని.. కానీ తాజాగా అరణ్య సినిమా చూశాక రానా నాకే పోటీగా మారాడని అనిపించిందని అగ్రహీరో వెంకటేశ్ తాజాగా భావోద్వేగానికి గురయ్యాడు.

    కళ్లలో నీళ్లు తిరుగుతున్న వేళ రానా యాక్టింగ్ గురించి తలుచుకొని వెంకటేశ్ ఎమోషనల్ అయ్యాడు. ప్రకృతికి కోపం వస్తే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు అని.. అడవి కథతో అరణ్య సినిమా తీసిన డైరెక్టర్ ప్రభుసాల్మాన్ కు కృతజ్ఞతలు అని వెంకటేశ్ అన్నారు.

    రానా మా వాడు అని కాదు కానీ.. అతడి నటన నమ్మశక్యంగా లేదని వెంకటేశ్ కొనియాడారు. రానా ఎంతో ఎదిగిపోయాడని.. నాకే పోటీగా మారాడని అన్నారు. ఇలాంటి సినిమా రానాకు ఇచ్చినందుకు ప్రభు సాల్మాన్ కు ధన్యవాదాలన్నారు.

    రానా మాట్లాడుతూ.. ‘అడవులు, ఏనుగుల మధ్యలో రెండున్నర సంవత్సరాలు ఉన్నాను. రెండు రోజులు అడవిలో ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. కానీ నేను ఈ సినిమా కోసం అన్ని సంవత్సరాలున్నా.. ఈ సినిమాతో ‘నేను ఎందుకు?’ అనే విషయాన్ని నేర్చుకున్నానని అన్నాడు. నా అనుభవాన్ని మాటల్లో చెప్పలేనని.. మీరు 26న థియేటర్లో సినిమా చూస్తే తెలుస్తుందని రానా అన్నారు.