https://oktelugu.com/

హిట్ వస్తేనే హీరోగారికి మార్కెట్ !

వచ్చిన సక్సెస్ ను నిలబెట్టుకోవడానికి హీరో నితిన్ ప్రస్తుతం కిందామీదా పడుతున్నాడు. అసలు ఒక హీరోకి పదేళ్ల పాటు సక్సెస్ లేకపోతే ఇక అతన్ని అసలు హీరోగానే లెక్కలోకి తీసుకోరు. అలా కొన్నాళ్ల పాటు హీరో అనే బిరుదును కూడా కోల్పోయి చివరకి ‘ఇష్క్’ అంటూ మొత్తానికి ఒక హిట్ కొట్టి.. మళ్ళీ ఎలాగోలా కెరీర్ లో హీరోగా సక్సెస్ లు అందుకుని.. ప్రస్తుతం ఏవరేజ్ హీరోల లిస్ట్ లో టాప్ ప్లేస్ లో తన స్థానాన్ని […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : March 21, 2021 / 07:07 PM IST
    Follow us on


    వచ్చిన సక్సెస్ ను నిలబెట్టుకోవడానికి హీరో నితిన్ ప్రస్తుతం కిందామీదా పడుతున్నాడు. అసలు ఒక హీరోకి పదేళ్ల పాటు సక్సెస్ లేకపోతే ఇక అతన్ని అసలు హీరోగానే లెక్కలోకి తీసుకోరు. అలా కొన్నాళ్ల పాటు హీరో అనే బిరుదును కూడా కోల్పోయి చివరకి ‘ఇష్క్’ అంటూ మొత్తానికి ఒక హిట్ కొట్టి.. మళ్ళీ ఎలాగోలా కెరీర్ లో హీరోగా సక్సెస్ లు అందుకుని.. ప్రస్తుతం ఏవరేజ్ హీరోల లిస్ట్ లో టాప్ ప్లేస్ లో తన స్థానాన్ని కొనాగిస్తోన్న నితిన్ కి ప్రస్తుతం ఒక్కటే టార్గెట్ అయిపొయింది.

    Also Read: ‘వకీల్ సాబ్’ హిస్టరీ రిపీట్ చేస్తాడా..?

    భీష్మతో తనకొచ్చిన భారీ హిట్ ను ఎలాగైనా నిలబెట్టుకోవాలని. కానీ చెక్ తో ఆ ప్లాన్ కి కాస్త చెక్ పడింది. ఇలాంటి పరిస్తతుల్లో నితిన్ నుండి వస్తోన్న మరో సినిమా ‘రంగ్ దే’. పేరులోని కలర్ సినిమాలో కూడా ఉంది అని టాక్. ఆ లెక్కన సినిమా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. త్వరలో విడుదల కానున్న ‘రంగ్ దే’ గాని హిట్ అయితే నితిన్ నుండి ఆ తరువాత రానున్న వరుస సినిమాలకు మంచి గిరాకీ వస్తోంది. అందుకే, నితిన్ ‘రంగ్ దే’ హిట్ కోసం పడిగాపులు కాస్తున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ఎందుకంటే ‘రంగ్ దే’ రిలీజ్ అయిన రెండు నెలల గ్యాప్ తర్వాత జూన్ లో ‘అంధధూన్’ రీమేక్ థియేటర్లలోకి రానుంది. ఈ రెండు సినిమాలు విడుదల కాగానే, ఆ తరువాత ‘పవర్ పేట’ అనే మరో సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది. ప్రస్తుతం షూటింగ్ తో బిజీగా ఉన్న ‘పవర్ పేట’ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కృష్ణ చైతన్య తీసే ఈ మూవీ రెండు పార్టులుగా విడుదల కాబోతుందట. మొత్తానికి నితిన్ మార్కెట్ మొత్తం ‘రంగ్ దే’ హిట్ పైనే ఆధారపడి ఉంది.