https://oktelugu.com/

గుడ్ న్యూస్.. డిసెంబర్ 25నుంచి భారత్ లో కరోనా వాక్సిన్ పంపిణీ.. ఆరోజు ప్రత్యేకత ఏంటీ?

ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పటికే బ్రిటన్ దేశంలో కరోనా వ్యాక్సిన్ వేయడం షూరు చేయగా అక్కడ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాలేదు. దీంతో భారత్ లోనూ కరోనా వ్యాక్సిన్ ను డిసెంబర్ 25ను పంపిణీ చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. Also Read: వరద సాయం కొనసాగుతుంది.. బాధితులు అధైర్య పడొద్దు: జీహెచ్ఎంసీ కరోనా వ్యాక్సిన్ ను ఎంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 9, 2020 / 04:45 PM IST
    Follow us on

    ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పటికే బ్రిటన్ దేశంలో కరోనా వ్యాక్సిన్ వేయడం షూరు చేయగా అక్కడ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాలేదు. దీంతో భారత్ లోనూ కరోనా వ్యాక్సిన్ ను డిసెంబర్ 25ను పంపిణీ చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.

    Also Read: వరద సాయం కొనసాగుతుంది.. బాధితులు అధైర్య పడొద్దు: జీహెచ్ఎంసీ

    కరోనా వ్యాక్సిన్ ను ఎంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే కేంద్రం మాత్రం డిసెంబర్ 25 నుంచి కోవిడ్-19టీకాను పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆరోజుకు ఏదైనా ప్రత్యేకత ఉందా? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

    డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ ఉండగా మరో విశేషం కూడా ఉందని తెలుస్తోంది. దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ జయంతి కూడా అదేరోజు కావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందనే ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ 25న ప్రధాని మోదీ సాంకేతికంగా వ్యాక్సిన్ ను ప్రారంభిస్తారు. అనంతరం అన్ని రాష్ట్రాలకు కేంద్రం కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేయనుంది.

    తొలిదశలో 3కోట్ల వ్యాక్సిన్లను నిల్వ ఉంచేందుకు ప్రభుత్వం సన్నహాలు చేస్తోంది. తొలుత దేశంలోని ఫ్రంట్ లైన్ వారియన్స్ కు వ్యాక్సిన్ వేస్తారు. ఆ తర్వాత ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఫ్రంట్ లైన్ వర్కర్లకు.. మిగతా రాష్ట్రాలకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి జనవరి 15వరకు సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నాయి.

    Also Read: కొత్త వ్యవసాయ చట్టాల్లో మార్పులకు కేంద్రం సుముఖం?

    కోవిడ్-19 వ్యాక్సిన్ వేసిన తర్వాత ఓ అరగంటపాటు ఆస్పత్రిలో ఉండాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుంటే వైద్యులు ఇంటికి పంపిస్తారు. ఈక్రమంలోనే పలు కంపెనీల వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. తొలుత ఒకరికి ఏ కంపెనీ వ్యాక్సిన్ ఇస్తారో.. అదే వ్యక్తి 15రోజుల తర్వాత తిరిగి అదే కంపెనీ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది.

    దీనికోసం వైద్య సిబ్బంది తగు ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే కేంద్రం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది.ఇదిలా ఉంటే కరోనా వ్యాక్సిన్ విషయంలో కేంద్రం మైలేజ్ గురించి ఆలోచించకుండా వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్