https://oktelugu.com/

ఇంగ్లీష్ సినిమాని కాపీ చేస్తోన్న సీనియర్ హీరో !

టాలీవుడ్ లో అరవై ప్లస్ హీరోలు ప్రస్తుతం ఎక్కువైపోయారు. తమకు ఏళ్ళు వచ్చినా ఇంకా హీరోయిన్లతో రొమాన్స్ చేయడానికే వాళ్ళు ఆసక్తి చూపించడం విశేషం. అయినా వయసు అయిపోయాక సాంగ్స్, మాస్ ఫైట్స్ చేయటం అనేది తెలుగు హీరోలకు ఎన్టీఆర్, ఏఎన్నార్ దగ్గర నుండి వస్తోన్న ఆనవాయితీ. పైగా హిట్ ఉన్న హీరోకి ఉండే క్రేజ్ వేరు కాబట్టి, కోట్లల్లో రెమ్యూనరేషన్ ఉంటుంది. అందుకే చిరు, బాలయ్య దగ్గర నుండి రాజశేఖర్ వరకూ ఇంకా హీరోగా కొనసాగడానికే […]

Written By:
  • admin
  • , Updated On : December 9, 2020 / 04:36 PM IST
    Follow us on


    టాలీవుడ్ లో అరవై ప్లస్ హీరోలు ప్రస్తుతం ఎక్కువైపోయారు. తమకు ఏళ్ళు వచ్చినా ఇంకా హీరోయిన్లతో రొమాన్స్ చేయడానికే వాళ్ళు ఆసక్తి చూపించడం విశేషం. అయినా వయసు అయిపోయాక సాంగ్స్, మాస్ ఫైట్స్ చేయటం అనేది తెలుగు హీరోలకు ఎన్టీఆర్, ఏఎన్నార్ దగ్గర నుండి వస్తోన్న ఆనవాయితీ. పైగా హిట్ ఉన్న హీరోకి ఉండే క్రేజ్ వేరు కాబట్టి, కోట్లల్లో రెమ్యూనరేషన్ ఉంటుంది. అందుకే చిరు, బాలయ్య దగ్గర నుండి రాజశేఖర్ వరకూ ఇంకా హీరోగా కొనసాగడానికే కిందామీదా పడుతున్నారు. అందుకే రాజశేఖర్ రెండు కొత్త సినిమాలను స్టార్ట్ చేయబోతున్నాడు.

    Also Read: ‘అల్లు స్నేహ’ వదిన ఆ గ్లాస్ దాచండి !

    కాగా అందులో ఒక సినిమా ‘పూలరంగడు, అహన పెళ్ళంట’ చిత్రాల డైరెక్టర్ వీరభద్రం చౌదరి దర్శకత్వంలో ఉండనుంది. సరికొత్త తరహా కథాంశంతో ఓ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా రాబోతుంది. కాగా ఈ సినిమా షూటింగ్ వచ్చే వారం నుండి అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదలుకానుందని… ఈ షెడ్యూల్ లో రాజశేఖర్ పై వచ్చే కీలకమైన సన్నివేశాలను షూట్ చేయనున్నారని తెలుస్తోంది. పైగా, ఈ షూట్ లో రాజశేఖర్ తో పాటు మిగిలిన నటీనటులందరూ కూడా పాల్గొనబోతున్నారని సమాచారం. అన్నట్టు ఈ సినిమాలో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక రాజశేఖర్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది.

    Also Read: సునీత వయసు ఎంత.. రెండో పెళ్ళికి కారణమేంటి ?

    కాగా రాజశేఖర్ పాత్రకు మరియు శివాత్మిక పాత్రకు మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ సినిమా మొత్తంలోనే మెయిన్ హైలెట్ గా ఉంటాయని.. ఎమోషనల్ గా సాగే ఈ సన్నివేశాల్లో రాజశేఖర్ పాత్ర చనిపోతుందని సమాచారం. ఇంతకీ ఈ సినిమా ఓ ఇంగ్లీష్ సినిమాకి కాపీ అట. ‘టోకెన్’ అనే ఇంగ్లీష్ సినిమా కథ నుండి ప్రేరణ పొంది.. ఈ సినిమా మెయిన్ పాయింట్ ను రాసుకున్నారట. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు గానీ.. రాజశేఖర్ టోకెన్ లాంటి సినిమాని చేయాలని చాల కాలం నుండి ఆశ పడుతున్నాడు. ఇక ఈ సినిమాలో రాజశేఖర్ ఎమ్మెల్యేగా నటించబోతునట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో ఈ సీనియర్ హీరోకి హిట్ వస్తోందా చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్