https://oktelugu.com/

సోషల్ మీడియలో అది ఫార్వర్డ్ చేస్తే నేరం!

సోషల్ మీడియా విస్తృతి పెరగడం వల్ల జనాలకు త్వరగా సమాచారం అందుతున్నప్పటికీ.. ఫేక్ సమాచారం, తమది కాని విషయాలను ఇష్టారీతిన ఫార్వర్డ్ చేయడం కూడా పెరిగింది. నిజానిజాలు తెలుసుకోకుండా గొర్రెల్లా ఫార్వార్డ్ చేసే ఇలాంటి వారిని “వాట్సాప్ యూనివర్సిటీ స్టూడెంట్స్” గా పిలుస్తుంటారు. తాము చేరవేసే విషయంలో వాస్తవం ఎంత? అనే కనీస ఆలోచన కూడా చేయరు. పలానా విషయం తమ ఆలోచనకు దగ్గరగా ఉంటే చాలు.. అన్ని గ్రూపుల్లోకీ తోసేయడమే ఇలాంటి వారి పని. ఇలా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 10, 2020 1:07 pm
    Follow us on

    Newspapers
    సోషల్ మీడియా విస్తృతి పెరగడం వల్ల జనాలకు త్వరగా సమాచారం అందుతున్నప్పటికీ.. ఫేక్ సమాచారం, తమది కాని విషయాలను ఇష్టారీతిన ఫార్వర్డ్ చేయడం కూడా పెరిగింది. నిజానిజాలు తెలుసుకోకుండా గొర్రెల్లా ఫార్వార్డ్ చేసే ఇలాంటి వారిని “వాట్సాప్ యూనివర్సిటీ స్టూడెంట్స్” గా పిలుస్తుంటారు. తాము చేరవేసే విషయంలో వాస్తవం ఎంత? అనే కనీస ఆలోచన కూడా చేయరు. పలానా విషయం తమ ఆలోచనకు దగ్గరగా ఉంటే చాలు.. అన్ని గ్రూపుల్లోకీ తోసేయడమే ఇలాంటి వారి పని. ఇలా చేయడం ద్వారా.. తామే ముందుగా గ్రూపులోని ఇతరులకు తెలివి నేర్పినట్టుగా ఫీలై పోతుంటారు.

    Also Read: కొత్త వ్యవసాయ చట్టాల్లో మార్పులకు కేంద్రం సుముఖం?

    ఇలాంటి మెసేజ్ ల‌ను ఫార్వ‌ర్డ్ చేసే వాళ్లను కంట్రోల్ చేయ‌డానికి వాట్సాప్ నిర్వాహ‌కులు కూడా ప‌లు ప్ర‌య‌త్నాలు చేశారు. అయినా.. ఫార్వర్డ్ పరంపర కొనసాగుతూనే ఉంది. ఇక, ఈ క‌రోనా కాలంలో అయితే ఈ ఫార్వ‌ర్డ్ లు ప‌తాక స్థాయికి చేరాయి. ఈ గోల తట్టుకోలేక గ్రూపుల్లోంచి బయటకు వచ్చేస్తున్నారు చాలా మంది.

    మొబైల్ డేటా చవకగా వినియోగంలోకి రావడంతో గంటల తరబడి ఫోన్లో మునిగిపోతున్నారు చాలా మంది. సోషల్ మీడియాలో ఉంటూ.. అవసరమైనవీ, కానివి ఇతరులకు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇలాంటి వారిలో కొందరు “పేపర్ బాయ్స్” కూడా ఉంటున్నారు! అవును.. వీరు వాట్సాప్ ద్వారా ఉద‌యాన్నే వార్తాప‌త్రిక‌ల‌ను గ్రూపుల్లోకి తోసేస్తుంటారు.

    Also Read: జనహిత రాజకీయమే ప్రభుత్వాలకు రక్ష

    ఎవ‌రో వాళ్ల‌కు వాటిని ఫార్వ‌ర్డ్ చేస్తారు. వీళ్లు ఆ ప‌త్రిక పీడీఎఫ్ ఫార్మాట్ ల‌ను తాము స‌భ్యులుగా ఉన్న ప్ర‌తి గ్రూప్ లోకి ప‌డేయ‌డం చేస్తూ ఉంటారు. తద్వారా.. ప్రజలకు జ్ఞానాన్ని పంచినట్టు ఫీలవుతుంటారు. కానీ.. వీరికి తెలియని నిజం ఒకటుంది. వార్తా ప‌త్రిక‌ల‌ను పీడీఎఫ్ ఫార్మాట్ లో పోస్ట్ చేయ‌డం చ‌ట్ట రీత్యా నేరం! అది ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ యాక్ట్ కింద సెక్ష‌న్ 43 ప్ర‌కారం శిక్షార్హమైన నేరం.

    డిజిట‌ల్ కంటెంట్ ను దాని యజమాని ప‌ర్మిష‌న్ లేకుండా.. ఇలా ఫార్వార్డ్ చేయ‌డం, స‌ర్క్యులేట్ చేయ‌డం నేర‌మ‌ని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ప‌త్రిక‌ల డిజిట‌ల్ ఎడిష‌న్ల‌పై ఎలాంటి హ‌క్కూ లేని వాళ్లు వాటిని సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయకూడదు. ఇలా ఫార్వ‌ర్డ్ చేసే వాళ్ల‌ను ఏదైనా మీడియా సంస్థ కోర్టుకు లాగితే.. వదిలించుకునేందుకు నానా తంటాలు పడాలి. కాబ‌ట్టి.. ఇక మీదనైనా న్యూస్ పేప‌ర్ ను పీడీఎఫ్ రూపంలో ఫార్వ‌ర్డ్ చేసే వాళ్లు మానుకోండి. చివరగా… ఈ విషయం మాత్రం అందరికీ షేర్ చేయండి.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

    సోషల్ మీడియలో అది ఫార్వర్డ్ చేస్తే నేరం..! | New update to Social Media Users | Ok Telugu