ఓ వైపు ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ తరుముకొస్తున్నాడు. హైకోర్టుల్లో ఎలాగైనా సరే ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ మాస్టర్ వేశాడు. స్థానిక ఎన్నికలకు రెడీ కావాలని డిసైడ్ అయ్యాడు. ఇందుకు తాజాగా పంపిణీ చేసే ఇళ్ల పట్టాలను ఆయుధంగా వాడాలని నిర్ణయించారు. ఏపీ కేబినెట్ భేటి సందర్భంగా సీఎం జగన్ ఈ మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్ధేశం చేసినట్టు తెలిసింది.
Also Read: తిరుపతి బైపోల్‌కు బీజేపీ రెడీ
స్థానిక సంస్థల ఎన్నికలకు మంచి అవకాశం వచ్చిందని సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈనెల 25 నుంచి 15 రోజుల పాటు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని.. దీన్ని స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి ఎమ్మెల్యే, మంత్రి ఉపయోగించుకోవాలని సీఎం జగన్ వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలకు దిశానిర్ధేశం చేశారు..
ప్రతి ఊరికి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి వెళ్లి పట్టాలు అందజేయాలని జగన్ ఆదేశించారు. స్థానిక సంస్తల ఎన్నికల ముందు గ్రామాల్లో ఎమ్మెల్యేలు ప్రచారం చేసేందుకు ఇదో మంచి అవకాశమని సీఎం వ్యాఖ్యానించారు.
Also Read: జగన్ రాజకీయ పరిణితి సాధించినట్లే..!
కోర్టుల్లో తీర్పులు వస్తే ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిద్దామని.. ఈ జనవరిలో ఇళ్ల పట్టాలతో స్థానిక ఎన్నికలకు వైసీపీ నేతలు రెడీ కావాలని జగన్ దిశానిర్ధేశం చేశారు. దీంతో జగన్ స్థానిక ఎన్నికలకు రెడీ అయినట్టే తెలుస్తోంది.
టీడీపీ, బీజేపీ ఇంకా సర్దుకోకముందే గ్రామాల్లోకి వైసీపీ నేతలు వెళ్లడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఇళ్ల పట్టాలను వారు ప్రచార అస్త్రంగా మలుస్తున్నారు. సీఎం జగన్ ఎన్నికలు వద్దు అని ఇన్నాళ్లు భీష్మించుకు కూర్చోగా తాజాగా ఆయన ఒక్కసారిగా మారి ఎన్నికలకు రెడీ కావడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్