https://oktelugu.com/

‘కంగారు’ పెట్టించారు..

ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్‌ వేదికగా జరుగుతున్న డే నైట్‌ టెస్టు మ్యాచ్‌లో ముందు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ పెద్దగా సత్తా చాటలేకపోయింది. దీంతో ఆటగాళ్లపై విమర్శలు వచ్చాయి. తక్కువ స్కోరుకే ఆల్‌ అవుట్‌ కావడంతో జట్టు కూర్పుపైనే దుమారం రేగింది. అయితే.. లక్ష్య ఛేదనకు బ్యాటింగ్‌కు దిగిన ఆసిస్‌ కూడా చతికిలపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. Also Read: భారత్‌ జట్టులో మంచి ఆటగాళ్లే లేరా..! పింక్‌బాల్‌ సవాల్‌లో తొలిరోజు చివర్లో తడబడిన టీమిండియా రెండో రోజు ఆస్ట్రేలియాపై పూర్తి […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 19, 2020 / 10:03 AM IST
    Follow us on


    ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్‌ వేదికగా జరుగుతున్న డే నైట్‌ టెస్టు మ్యాచ్‌లో ముందు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ పెద్దగా సత్తా చాటలేకపోయింది. దీంతో ఆటగాళ్లపై విమర్శలు వచ్చాయి. తక్కువ స్కోరుకే ఆల్‌ అవుట్‌ కావడంతో జట్టు కూర్పుపైనే దుమారం రేగింది. అయితే.. లక్ష్య ఛేదనకు బ్యాటింగ్‌కు దిగిన ఆసిస్‌ కూడా చతికిలపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

    Also Read: భారత్‌ జట్టులో మంచి ఆటగాళ్లే లేరా..!

    పింక్‌బాల్‌ సవాల్‌లో తొలిరోజు చివర్లో తడబడిన టీమిండియా రెండో రోజు ఆస్ట్రేలియాపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. అశ్విన్‌, బూమ్రా, ఉమేశ్‌ ముప్పేట దాడిలో తల్లడిల్లిన కంగారూ టీమ్‌ శుక్రవారం ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియాకు 53 పరుగుల లీడ్‌ వచ్చింది.

    స్పిన్‌ మాంత్రికుడు రవిచంద్రన్‌ అశ్విన్‌ అదిరిపోయే పర్‌‌ఫార్మెన్స్‌ ఇచ్చాడు. పింక్‌ బాల్‌ను గిరగిరా తిప్పస్తూ కంగారూలను నిద్రపోకుండా చేశాడు. 11 పరుగులకే చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. తొలి రెండు వికెట్లు తీసిన బూమ్రా ప్రత్యర్థి పతనానికి పునాది వేస్తే.. అశ్విన్‌ స్పిన్‌ మాయాజాలంతో మిడిలార్డర్‌‌ నడ్డివిరిచాడు.

    ఆసిస్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ 99 బంతుల్లో 10 ఫోర్లతో 73 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మార్నస్‌ లబుషేన్‌ 119 బంతుల్లో 7 ఫోర్లతో 47 చేయగా.. మరో ఆరుగురు సింగిల్‌ డిజిట్‌కే పరిమితం అయ్యారు. స్టీవ్‌ స్మిత్‌ (1) సహా ఆరుగురు పెద్దగా రాణించలేకపోయారు. తొలి ఇన్నింగ్స్ లో రెండో బంతికే క్లీన్ బౌల్డ్ అయిన షా, రెండో ఇన్నింగ్స్ లో కూడా అచ్చం అలాంటి బంతినే డ్రైవ్ చేయ‌బోయి వికెట్ ను పారేసుకున్నాడు. స్థూలంగా ఇప్పటి వ‌ర‌కూ తొలి 62 ప‌రుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది టీమిండియా.

    Also Read: డిఫెన్స్ లో భారత్.. కోహ్లీ ఒక్కడే నిలిచాడు

    ఆట మూడో రోజు కీల‌కంగా మార‌నుంది. తొలి ఇన్నింగ్స్ త‌ర‌హాలోనే పూజారా, కొహ్లీ, ర‌హ‌నేల మీదే పూర్తి భారం ప‌డ‌నుంది. బౌల‌ర్లు మంచి ఊపు మీద క‌నిపిస్తుండటంతో.. ఆస్ట్రేలియాకు టీమిండియా ఓ మోస్తరు ల‌క్ష్యాన్ని నిర్దేశించినా మిగ‌తా ప‌నిని బౌల‌ర్లు పూర్తి చేసే అవ‌కాశం ఉంది. ప్రస్తుతం అయితే బోర్డర్-–గ‌వాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టు మ్యాచ్ పై భార‌త జ‌ట్టు పై చేయి సాధించింది. ఇదే ప‌ట్టును కొన‌సాగిస్తే.. సీరిస్ లో టీమిండియా శుభారంభం సాధించడం ఖాయం.