చైనా మళ్లీ దుస్సాహసం.. సరిహద్దుల్లో కుట్ర

కరోనా వైరస్ ను ప్రపంచానికి అంటించి లక్షల మంది చావులకు కారణమైన చైనా ఇప్పుడు సరిహద్దు దేశాలతో కయ్యానికి కాలుదువ్వుతూ వాటిపై దురాక్రమణకు చూస్తోంది. ఇప్పటికే భారత్ తో సరిహద్దుల్లో గిచ్చి కయ్యం పెట్టుకుంటోంది. లఢక్ సరిహద్దుల్లో చైనా-భారత్ సైనికుల ఘర్షణ జరిగి చాలా మంది ప్రాణాలు పోయాయి. Also Read: అమెరికా భారతీయులకు తీపి కబురు దీంతో చైనా దేశంలో ఇప్పుడు ఈశాన్య భారత్ పై కన్నేసింది. అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమేనన్న వాదనలకు బలం […]

Written By: NARESH, Updated On : December 7, 2020 7:38 pm
Follow us on

కరోనా వైరస్ ను ప్రపంచానికి అంటించి లక్షల మంది చావులకు కారణమైన చైనా ఇప్పుడు సరిహద్దు దేశాలతో కయ్యానికి కాలుదువ్వుతూ వాటిపై దురాక్రమణకు చూస్తోంది. ఇప్పటికే భారత్ తో సరిహద్దుల్లో గిచ్చి కయ్యం పెట్టుకుంటోంది. లఢక్ సరిహద్దుల్లో చైనా-భారత్ సైనికుల ఘర్షణ జరిగి చాలా మంది ప్రాణాలు పోయాయి.

Also Read: అమెరికా భారతీయులకు తీపి కబురు

దీంతో చైనా దేశంలో ఇప్పుడు ఈశాన్య భారత్ పై కన్నేసింది. అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమేనన్న వాదనలకు బలం చేకూర్చుకునే దిశగా చైనా కుట్రలు చేస్తోంది.హన్ చైనీస్ వర్గం ప్రజలను, టిబెట్ లోని కమ్యూనిస్టు పార్టీ సభ్యులను భారత సరిహద్దుల్లోకి తరలించే వ్యూహాన్ని చైనా చేస్తోందని సమాచారం.

Also Read: పాపం ట్రంప్.. నరకయాతన పడుతున్నాడట..!

భారత్ సరిహద్దుకు సమీపంలో కొత్తగా చైనా గ్రామాలను ఏర్పాటుచేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నవంబర్ మధ్యలో అక్కడ కనీసం 3 గ్రామాలు వెలిసినట్లు ఉపగ్రహ ఛాయచిత్రాలు తాజాగా నిర్ధారించాయి. భారత్ లోకి చొరబాటుదారులను పంపించేందుకే ఈ గ్రామాలను చైనా ఉపయోగించుకునే అవకాశం ఉంది.

మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు

పశ్చిమ అరుణాచల్ ప్రదేశ్ లో భారత్-చైనా-భూటాన్ సరిహద్దులు కలిసే చోటుకు సమీపంలో బుమ్ లా పాస్ ఉంది. అక్కడికి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో చైనా కొత్తగా కనీసం మూడు గ్రామాలను నిర్మించింది. ఆ గ్రామాల్లో ఉండే వారి పని గస్తీ కాయడమేనని అంటున్నారు. డోక్లాంలోని భూటాన్ భూభాగంలో చైనా మరికొన్ని గ్రామాలను నిర్మిస్తున్నట్టు చాయ చిత్రాల ద్వారా తెలుస్తోంది. .