https://oktelugu.com/

కాళ్లకు మొక్కి బ్లెస్సింగ్స్ తీసుకున్న రజినీకాంత్ !

సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ పెట్టడానికి రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. రజిని జనవరి 2021లో తన పార్టీ పేరుని ప్రకటిస్తాడని కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా రజినీకాంత్ పార్టీ పెట్టాలని ఫిక్స్ అయ్యాక… పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటూ.. గురువుల సూచనలను వింటూ చాలా ప్లాన్డ్ గా రజిని రాజకీయాల్లోకి రాబోతున్నాడు. కాగా తాజాగా బెంగుళూర్ లో నివాసం ఉండే తన అన్నయ్య సత్యనారాయణ ఇంటికి వెళ్లి ఆయన […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 7, 2020 / 05:14 PM IST
    Follow us on


    సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ పెట్టడానికి రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. రజిని జనవరి 2021లో తన పార్టీ పేరుని ప్రకటిస్తాడని కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా రజినీకాంత్ పార్టీ పెట్టాలని ఫిక్స్ అయ్యాక… పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటూ.. గురువుల సూచనలను వింటూ చాలా ప్లాన్డ్ గా రజిని రాజకీయాల్లోకి రాబోతున్నాడు. కాగా తాజాగా బెంగుళూర్ లో నివాసం ఉండే తన అన్నయ్య సత్యనారాయణ ఇంటికి వెళ్లి ఆయన కాళ్లకు మొక్కి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు రజినీకాంత్. తానూ ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా.. అన్నయ్య ముందు చాలా చిన్నపిల్లాడిలానే రజిని ఉంటాడట.

    Also Read: భారత్ బంద్ కేవలం నాలుగు గంటలేనటా..!

    ఏ పని చేసిన తన అన్నయ్యకు చెప్పకుండా చేయడట. నిజానికి రజినీకాంత్ కి అన్నయ్య ఉన్నట్లే చాలామందికి తెలియదు. కానీ రజిని తన అన్నయ్యను తండ్రిగా భావిస్తాడట. అలాగే కమల్ హాసన్ సహా కోలీవుడ్ లోని తన స్నేహితులను కూడా రజినీకాంత్ కలిసి వారి మద్దతు, దీవెనలు కోరుతాడని తెలుస్తోంది. రాజకీయాల్లోకి రజిని లేట్ గా వచ్చినా.. అందరినీ కలుపుకునిపోవాలని ఆశ పడుతున్నట్లు ఉన్నాడు. నిజానికి మొదట రజినీకాంత్… రాజకీయ పార్టీ విషయంలో ఊగిసలాడాడు. కానీ అన్ని ఆలోచించుకున్న తర్వాత ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయం తీసుకుని.. దానికి తగ్గట్లుగా ముందుకు వస్తున్నాడు.

    Also Read: అనూహ్యం పరిణామం: రజినీకాంత్-కమల్ హాసన్ కలుస్తున్నారా?

    అసలు రజినీకాంత్ రాజకీయాలోకి రావాలని 1990లలోనే అనుకున్నాడని.. కాకపోతే అప్పటి సినిమాల బిజీలో రజినికి టైం కుదరలేదట. కానీ తన మద్దతును మాత్రం రజిని బాహాటంగానే ప్రకటించాడు. ముఖ్యంగా జయలలితకి ఓటేస్తే ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడని 20 ఏళ్ల క్రితం రజినీకాంత్ అన్న మాటకు ఆమె పార్టీ ఘోరంగా ఓడింది అప్పట్లో. ఆ లెవల్లో రజినీకాంత్ కి అప్పుడు ఫాలోవింగ్, ఇమేజ్ ఉండేది. కానీ ఇప్పుడు కూడా ఆ రేంజ్ ఇమేజ్ ఉందా అంటే.. అనుమానమే.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్