https://oktelugu.com/

‘భారత్ బంద్’పై కొర్రీలు పెడుతున్న మమతా బెనర్జీ..!

బీజేపీ అంటే ఒంటికాలిపై లేచే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈసారి కాస్తా భిన్నంగా వ్యవహరించారు. మోదీ సర్కార్ వ్యవసాయ సంస్కరణ పేరిట తీసుకొచ్చిన బిల్లులను రద్దు చేయాలని 11రోజులుగా ఢిల్లీలో రైతులు దీక్షలు చేస్తున్న సంగతి తెల్సిందే. ఈక్రమంలోనే డిసెంబర్ 8న(రేపు) భారత్ బంద్ కు రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. భారత్ బంద్ కు ఇప్పటికే దేశంలోని పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. కాంగ్రెస్.. టీఆర్ఎస్.. టీడీపీ.. ఎన్సీపీ.. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 7, 2020 6:07 pm
    Mamata Banerjee
    Follow us on

    బీజేపీ అంటే ఒంటికాలిపై లేచే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈసారి కాస్తా భిన్నంగా వ్యవహరించారు. మోదీ సర్కార్ వ్యవసాయ సంస్కరణ పేరిట తీసుకొచ్చిన బిల్లులను రద్దు చేయాలని 11రోజులుగా ఢిల్లీలో రైతులు దీక్షలు చేస్తున్న సంగతి తెల్సిందే. ఈక్రమంలోనే డిసెంబర్ 8న(రేపు) భారత్ బంద్ కు రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు.

    భారత్ బంద్ కు ఇప్పటికే దేశంలోని పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. కాంగ్రెస్.. టీఆర్ఎస్.. టీడీపీ.. ఎన్సీపీ.. శివసేన. అకాలీదళ్ తదితర పార్టీలు మద్దతు సంఘీభావం ప్రకటించారు. తృణమూల్ కాంగ్రెస్ సైతం రైతులకు మద్దతు ప్రకటించింది. అయితే భారత్ బంద్ కు మద్దతు ఇచ్చేది లేదంటూ తిరకాసు పెడుతోంది.

    పశ్చిమబెంగాల్ లోని వెస్ట్ మిడ్నాపూర్ లోని ర్యాలీలో సీఎం మమతా బెనర్జీ భారత్ బంద్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను కేంద్రం వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే మోదీ ప్రభుత్వం గద్దె దిగిపోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    2006లో సింగూరు వేదికగా తాము దాదాపు 26రోజులపాటు నిరశన చేసిన విషయాన్ని మమత గుర్తు చేశారు. సింగూరులో జరిగిన కార్యక్రమాన్ని తామెన్నడూ మరిచిపోమని తెలిపారు. తాము ‘బంద్’కు మద్దతిచ్చేది లేదని.. అయితే రైతుల న్యాయమూన డిమాండ్లకు సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

    బెంగాల్లో బీజేపీ పట్టు సాధించకుండా తమ పోరాటం సాగుతుందని.. ప్రజలు బీజేపీని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం ఎంతో సమర్థవంతంగా పనిచేస్తున్న ప్రతిపక్షాలు బురదజల్లుతున్నాయంటూ మండిపడ్డారు.

    రాఫెల్ అవినీతి.. పీఎం కేర్స్ వివరాలను బహిర్గతం చేయరుకానీ ఆఫన్ తుపాను వల్ల జరిగిన నష్టంపై మాత్రం లెక్కలు అడుగుతున్నారని ఆమె విమర్శించారు. బెంగాల్లోకి బయటి శక్తులను రానిచ్చేది లేదని.. ప్రజలు కూడా రానివ్వద్దంటూ ఆమె విజ్ఞప్తి చేశారు.