కేంద్రంలో మోదీ సర్కార్ వచ్చినప్పటి నుంచే జమిలి ఎన్నికలపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ప్రధాని మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పలుసార్లు జమిలి ఎన్నికలపై ప్రస్తావించారు. ఈనేపథ్యంలోనే కేంద్రం 2022లో జమిలి ఎన్నికలకు వెళ్లనుందనే ప్రచారం జాతీయ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
Also Read: రజనీ పార్టీ చిహ్నం ఇదే..?ప్రజలను ఆకట్టుకోనుందా..?
మోదీ అధికారంలోకి వచ్చాక పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. పెద్దనోట్ల రద్దు.. నల్లధనం వెలికితీత.. జీఎస్టీ.. త్రిపుల్ తలాక్ రద్దు.. 370 రద్దు.. కశ్మీర్ రెండుగా విభజన.. అయోధ్యలో రామమందిరం.. వ్యవసాయ సంస్కరణ వంటి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈక్రమంలోనే మోదీ సర్కారు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈమేరకు కేంద్రం ఎన్నికల సంఘం కూడా ఆధార్ కార్డుతో ఓటర్ ఐడీలను డిజిటలైజ్ చేస్తుండటంతో జమిలి ఎన్నికలు త్వరలో వస్తాయనే ఊహగానాలకు మరోసారి ఊతమిచ్చింది.
ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేస్తున్నా ఓటర్ కార్డులో ఒకే క్యూఆర్ కోడ్ ఉంటుంది. అయితే డిజిటలైజ్లో మాత్రం రెండు క్యూఆర్ కోడ్‌లు ఉండనున్నాయి. ఇందులో ఒక క్యూర్ కోడ్లో మన వివరాలు.. రెండో క్యూఆర్ కోడ్‌లో మన తల్లిదండ్రుల పేర్లు జత చేస్తారు. ఓటర్ కార్డును ఆధార్ తో అనుసంధానించడం ద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కలుగనుంది.
Also Read: అక్కడ బీజేపీ మౌనం.. వ్యూహం ఏంటి?
2021లో జరుగనున్న అస్సాం.. కేరళ.. పాండిచ్చేరి.. తమిళనాడు.. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ డిజిటలైజ్ ను పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. దీనికితోడు ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉంది. కాంగ్రెస్ బలపడటానికి ముందుగానే ఎన్నికలకు వెళితే బీజేపీ గ్రాండ్ విక్టరీ కొడుతుందని ఆపార్టీ నేతలు భావిస్తుండటం కూడా ఒక కారణంగా కన్పిస్తోంది.
ఇక దేశవ్యాప్త ఎన్నికల వల్ల ఎన్నికల ఖర్చు భారీగా తగ్గడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరగనుంది. దీంతో కేంద్రం ఆ దిశగా ముందుకెళ్లాలని ఆలోచిస్తుంది. అయితే 130కోట్ల జనాభా ఉన్న భారత్ లో ఒకేసారి దేశవ్యాప్త ఎన్నికలు నిర్వహించడం సాధ్యమయ్యేనా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. దీనిపై త్వరలోనే మరింత క్లారిటీ వచ్చే అవకాశం కన్పిస్తోంది.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్