తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త పార్టీపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. రాష్ట్రంలో జరిగిన గత ఎన్నికల సమయంలోనే రజనీ పార్టీ పెట్టినా ఆ ఎన్నికల్లోపోటీ చేయలేదు. ఆ తరువాత కూడా పార్టీ గురించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే మారుతున్న పరిణామాలతో రజనీ క్రీయాశీలకంగా రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. తాను రాజకీయాల్లోకి రావాల్సిన అససరం ఏర్పడిందని, అయితే కొత్త సంవత్సరం కానుకగా డిసెంబర్ 31న అధికారికంగా పార్టీ ప్రకటన చేస్తానని తెలిపారు.
Also Read: అక్కడ బీజేపీ మౌనం.. వ్యూహం ఏంటి?
ఈ నేపథ్యంలో పార్టీ పేరు, చిహ్నంపై కసరత్తులు ప్రారంభమయ్యాయి. గురువారం పార్టీ ముఖ్య నాయకులు అర్జున్మూర్తి, తమిళరివి మణియన్ మక్కల్ మండం జిల్లాల కార్యదర్శులతో రజనీకాంత్ భేటీ అయ్యారు. పార్టీకి చిహ్నంగా ముందుగా సైకిల్ ఉంటే బాగుంటుందని అనుకున్నారు. కానీ ఆ తరువాత రజనీ నటించిన ‘అన్నామలై’ చిత్రంలోని గెటప్ ను చిహ్నంగా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. పాలక్యాన్ ఉన్న సైకిల్ రజనీ పట్టుకొని ఉండే ఈ చిత్రాన్నే గుర్తుగా మార్చుకోనున్నట్లు సమాచారం.
ఇక జెండా విషయంలోనూ సుధీర్ఘంగా చర్చ సాగింది. మూడు రంగుల జెండాను తీర్చిదిద్దాలని నిర్ణయానికి వచ్చారు. ప్రజల్ని ఆకర్షించే విధంగా రంగులు ఉండాలని చర్చించారు. అయితే ఆ మూడు వర్ణాలేంటనే దానిపై మాత్రం నిర్ణయించలేదు. కాగా జెండాకు మూడు రంగులు ఉండాలని మక్కల్ మండ్రం నిర్వాహకులు అంగీకారం తెలిపినా రజనీ మాత్రం ఫైనల్ చేయాల్సి ఉంటుంది.
Also Read: రాహుల్ జాతీయ నాయకుడు కాదంటున్న సీనియర్ నేత..!
ఇదిలా ఉండగా రజనీ పార్టీ కసరత్తులపై ఇతర పార్టీల నేతలు ఆసక్తిగా గమనిస్తున్నారు. కొన్ని పార్టీల్లోని అసంత్రుప్త నేతలు రజనీ పార్టీలోకి చేరేందుకు యత్నిస్తున్నారు. ఇన్నిరోజులు జెండాలు మోసినా పదవులు దక్కని నేతలు రజనీ హామీ ఇస్తే రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి డిసెంబర్ 31న రజనీ పార్టీని ప్రకటించి ఎలాంటి నినాదంతో ప్రజల్లోకి వెళ్తాడో చూడాలి..
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్