Akanksha Modi: చీకటిని చూస్తూ తిట్టుకునే కంటే ఆ చీకట్లోనే ఓ చిరుదీపం వెలిగించడం మంచిది అనేది చైనా సామెత. అవకాశాల కోసం చూసే వాడు దురదృష్టవంతుడు అవకాశాలను సృష్టించుకునే వాడు అదృష్టవంతుడు.
కేవలం వెయ్యి రూపాయల సంపాదనతో ప్రస్తుతం ఏకంగా రూ. 4 కోట్ల టర్నోవర్ కు చేరుకోవడం గమనార్హం. చిట్కా వ్యాపారం కాస్త పెద్ద వ్యాపారంగా మారడం తెలిసిందే. చర్మ సంరక్షణ ఉత్పత్తులను విదేశాల్లో కూడా వినియోగదారులుండటం తెలిసిందే.
కోల్ కతా కు చెందిన ఆకాంక్ష మోడీ రూ. వెయ్యి రూపాయల పెట్టుబడితో ప్రారంభించి అతిపెద్ద వ్యాపారంగా చేయడం అంటే మాటలు కాదు. ఏడేళ్ల కాలంలో వ్యాపారాన్ని దినదినాభివృద్ధి చేసి దేశంలోనే ప్రముఖ వ్యాపార సంస్థగా మార్చి అందరి మన్ననలు అందుకుంటోంది. తన భర్త ఇచ్చిన ప్రోత్సాహమే తననీ స్థాయికి చేర్చించిందని చెబుతోంది. సింగపూర్, యూకే, అమెరికా లాంటి దేశాల్లో కూడా కస్టమర్లను సంపాదించుకోవడం విశేషం.
Also Read: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీవేతనంతో జాబ్స్.. పరీక్ష లేకుండా?
ఆమె ఓసారి చర్మ సంబంధ డాక్టర్ వద్దకు తన అత్తమ్మను తీసుకెళ్లగా అక్కడందరు ఒకటే వ్యాధితో బాధపడటం చూసింది. దీంతో తాను ఆ వ్యాధికి మందు కనుగొనలేనా అని ఆలోచించి ప్రయోగం చేసింది. అది సఫలం కావడంతో వినియోగదారులు పెరిగారు. ప్రస్తుతం 80 రకాల ఉత్పత్తులు తయారు చేసి మార్కెటింగ్ చేస్తున్నారు.
చర్మ సంబంధమైన ఉత్పత్తులు మార్కెటింగ్ చేస్తున్నారు. 80 రకాల వస్తువులు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో రూ. కోట్ల వ్యాపారం కొనసాగుతోంది. అమెజాన్ లాంటి సంస్థ ద్వారా ఉత్పత్తులను మార్కెటింగ్ కు పంపిస్తున్నారు. సంస్థలో 52 మంది పనిచేస్తున్నారు. వారిలో ఎక్కువగా మహిళలే ఉండటం విశేషం. దీంతో ఆకాంక్ష తన కలలను నెరవేర్చుకునే క్రమంలో ఎన్నో ఆటుపోట్లు దాటి ఇంత స్థాయికి చేరడం మామూలు విషయం కాదు.
Also Read: మెంతి ఆకులతో ఆ వ్యాధులకు సులువుగా చెక్ పెట్టే ఛాన్స్.. ఎలా అంటే?