https://oktelugu.com/

Sukumar-Bunny: ప్చ్.. సుక్కు – బన్నీ మధ్య ఇంత ప్రేమ ఉందా ?

Sukumar-Bunny: అల్లు అర్జున్ కి, సుకుమార్ కి మధ్య మంచి స్నేహం ఉందని, ఇద్దరికీ ఒకరి పై ఒకరికి నమ్మకం ఉంది అనుకున్నారు ఇన్నాళ్లు, కాదు. ఒకరి పై ఒకరికి అభిమానం ఉంది. పుష్ప సినిమా “థ్యాంక్ యూ” మీట్ లో ఈ విషయం చాలా స్పష్టంగా ఎలివేట్ అయింది. సుకుమార్, మొదట బన్నీ గురించి మాట్లాడుతూ “అల్లు అర్జున్ నాకు దేవుడు లాంటి వాడు’ అన్నాడు. నిజంగా ఈ మాటకు అక్కడ ఉన్న అందరూ షాక్ […]

Written By:
  • Shiva
  • , Updated On : December 29, 2021 / 11:13 AM IST
    Follow us on

    Sukumar-Bunny: అల్లు అర్జున్ కి, సుకుమార్ కి మధ్య మంచి స్నేహం ఉందని, ఇద్దరికీ ఒకరి పై ఒకరికి నమ్మకం ఉంది అనుకున్నారు ఇన్నాళ్లు, కాదు. ఒకరి పై ఒకరికి అభిమానం ఉంది. పుష్ప సినిమా “థ్యాంక్ యూ” మీట్ లో ఈ విషయం చాలా స్పష్టంగా ఎలివేట్ అయింది. సుకుమార్, మొదట బన్నీ గురించి మాట్లాడుతూ “అల్లు అర్జున్ నాకు దేవుడు లాంటి వాడు’ అన్నాడు. నిజంగా ఈ మాటకు అక్కడ ఉన్న అందరూ షాక్ అయ్యారు.

    Sukumar-Bunny

    సుకుమార్ కి కొంచెం అహం ఎక్కువ. తాను గొప్ప క్రియేటివ్ డైరెక్టర్ ను అనే ఫీలింగ్ లో ఉంటాడు. అందుకే, స్టార్లు అయినా సుకుమార్ ఎన్నడూ వాళ్ళను ఓవర్ గా పొగిడడు. కానీ బన్నీ విషయంలో అందుకు పూర్తిగా విరుద్ధంగా జరిగింది. ఇంకా బన్నీ గురించి ఎమోషనల్ గా మాట్లాడుతూ.. ‘యాక్టర్ గా బన్నీ వీవర్ అఫ్ ఎమోషన్స్. మొహంలోనే అన్ని భావాలు పలికించగల గొప్ప నటుడు’ అంటూ తెగ పొగిడేశాడు.

    సరే.. ఎలాగూ పుష్పకు నెగిటివ్ టాక్ వచ్చింది కాబట్టి.. సుకుమార్ కాస్త తన పైత్యం తగ్గించుకుని బన్నీ పై ప్రేమను చూపించాడు అనుకోవడానికి లేదు. పుష్పకు 275 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి అని నిర్మాతే చెప్పాడు. అయినా సుక్కు తగ్గడం ఆశ్చర్యకరమే. ఇక అటు అల్లు అర్జున్ కూడా స్టేజిపై మాట్లాడుతూ బాగా ఎమోషనల్ అయ్యాడు.

    Also Read: సుకుమార్​ గురించి మాట్లాడుతూ.. స్టేజ్​పైనే కంటనీరు పెట్టుకున్న బన్నీ

    ముఖ్యంగా సుకుమార్ గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకుని తనను తాను కంట్రోల్ చేసుకోలేక పోయాడు. “సుకుమార్ లేకపోతే ఆర్య లేదు.. ఆర్య లేకపోతే నేనులేను.’ అంటూ బన్నీ కన్నీళ్లు పెట్టుకోవడం సుకుమార్ ను కూడా షాక్ కి గురి చేసింది. అందుకే సుకుమార్ కూడా ఆ సమయంలో ఏడ్చాడు. మొత్తమ్మీద బన్నీ చాలా స్పష్టంగా చెబుతూ.. ‘ఈ రోజు నా కెరీర్ ఇంత అద్భుతంగా ఉంది అంటే దానికి కారణం సుకుమార్ అని గర్వంగా చెబుతాను’ అంటూ తేల్చి చెప్పాడు.

    అన్నట్టు సుకుమార్ తన సినిమాకు పనిచేసిన వారందరికీ పేరుపేరునా థాంక్స్ చెప్పడంతో పాటు.. లైట్ బాయ్స్, సెట్ బాయ్స్ తో పాటు ఇతర వర్కర్స్ కి కూడా తలా లక్ష రూపాయల ఇస్తానని సగర్వంగా చెప్పుకొచ్చాడు. సుక్కు – బన్నీ మధ్య ఇంత ప్రేమ ఉందా ? అని నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు.

    Also Read: ‘పుష్ప’ కలెక్షన్స్ లో వాస్తవం ఎంత ?.. నిజమేనా నవీన్ ?

    Tags