Pushpa Box Office Collection: ‘ఐకాన్ స్టార్’ ‘అల్లు అర్జున్’ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయింది. అయితే, ప్రేక్షకులను మెప్పించే కోణంలో నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఇక బాక్సాఫీసు వద్ద ఈ సినిమా నిలబడటం కష్టమే అనుకున్నారు. అయితే, పుష్ప మాత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.
ముఖ్యంగా నైజాంలో మంచి కలెక్షన్స్ ను రాబడుతుంది. రికార్డుల మోత మోగిస్తోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా చూసుకుంటే.. వందల కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేసి పారేస్తోంది.
మరి పుష్ప 11 రోజుల కలెక్షన్ల వివరాలను ఏరియాల వారీగా చూస్తే..
నైజాం 34.46 కోట్లు
సీడెడ్ 12.50 కోట్లు
ఉత్తరాంధ్ర 7.06 కోట్లు
ఈస్ట్ 4.48 కోట్లు
వెస్ట్ 3.70 కోట్లు
గుంటూరు 4.83 కోట్లు
కృష్ణా 3.82 కోట్లు
నెల్లూరు 2.85 కోట్లు
ఇక ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకొని చూస్తే : 73.70 కోట్లు.
తమిళ నాడు 6.95 కోట్లు
కేరళ 4.45 కోట్లు
కర్ణాటక 9.60 కోట్లు
రెస్ట్ 17.50 కోట్లు
ఓవర్సీస్ 11.40 కోట్లు
Also Read: ‘పుష్ప’ కలెక్షన్స్ లో వాస్తవం ఎంత ?.. నిజమేనా నవీన్ ?
ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 123.60 కోట్లు ఈ చిత్రం రాబట్టింది.
అయితే, పుష్ప సినిమా అన్ని భాషల వెర్షన్ లను కలుపుకుని మొత్తం రూ.146.5 కోట్లు వరకు భారీ స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది. అన్నీ చోట్ల భారీ రేట్లకు బయ్యర్లకు ఈ చిత్రం థియేటర్ రైట్స్ ను అమ్మారు. కాబట్టి.. బయ్యర్లు బాక్సాఫీస్ వద్ద సేఫ్ అవ్వాలి అంటే.. మొత్తం ఈ సినిమా రూ.146 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంది.
అయితే నిన్నటి వరకు ఈ చిత్రం అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.123.60 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది. అంటే బ్రేక్ ఈవెన్ కు రూ.22.4 కోట్ల షేర్ ను కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఒక్క ఆంధ్రలో తప్ప మిగిలిన అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు బాగానే కలెక్షన్స్ వస్తున్నాయి.