
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కోట్ల సంఖ్యలో ప్రజలు వ్యాక్సిన్ ను వేయించుకున్నారు. మొదట్లో కరోనా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ కు భయపడి కొంతమంది వ్యాక్సిన్ వేయించుకోకపోవడానికి ఆసక్తి చూపకపోయినా సైడ్ ఎఫెక్ట్స్ ఒకటి రెండు రోజులు మాత్రమే ఉంటాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొన్ని పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వెంటనే వైరస్ సోకకుండా ఇమ్యూనిటీ రాదు. అందువల్ల కరోనా వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ మాస్క్ ను కచ్చితంగా ధరించాల్సి ఉంటుంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు భౌతిక దూరం పాటించడంతో పాటు రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉంటే మంచిది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే మంచిదని చెప్పవచ్చు.
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత పచ్చబొట్టు వేయించుకోకూడదు. పచ్చబొట్టు ఇమ్యూనిటీ పవర్ ను ప్రేరేపించే అవకాశం ఉంటుంది కాబట్టి పచ్చబొట్టుకు దూరంగా ఉంటే మంచిది. కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తరువాత తగినంత గ్యాప్ తీసుకుని మాత్రమే రెండో డోస్ తీసుకోవాలి. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కఠిన వ్యాయామాలకు దూరంగా ఉండాలి. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత శరీరానికి అవసరమైన స్థాయిలో నీటిని తాగాలి.
కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్న తర్వాత మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. మద్యం సేవించడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయి.