జగన్ బెయిల్ రద్దు: ట్విస్ట్ ఇచ్చిన సీబీఐ..!

జగన్ బెయిల్ రద్దు విషయంపై సీబీఐ కోర్టు తాజాగా మరో ట్విస్టు ఇచ్చింది. ఈ విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేసింది. సీబీఐ పై వస్తున్న ఆరోపణలు తదితర అంశాలతో సీరియస్ గా తీసుకున్న అధికారులు ఆరోజున తమ నిర్ణయం ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తామని అధికారులు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. అదే రోజు జగన్ బెయిల్ పై సీబీఐ నిర్ణయాన్ని ప్రకటించడం […]

Written By: NARESH, Updated On : July 2, 2021 8:06 am
Follow us on

జగన్ బెయిల్ రద్దు విషయంపై సీబీఐ కోర్టు తాజాగా మరో ట్విస్టు ఇచ్చింది. ఈ విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేసింది. సీబీఐ పై వస్తున్న ఆరోపణలు తదితర అంశాలతో సీరియస్ గా తీసుకున్న అధికారులు ఆరోజున తమ నిర్ణయం ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తామని అధికారులు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. అదే రోజు జగన్ బెయిల్ పై సీబీఐ నిర్ణయాన్ని ప్రకటించడం ఆసక్తిగా మారింది.

ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దుపై ఎంపీ రఘురామ వేసిన పిటిషన్ పై జగన్ లాయర్లు వాదించారు. ఈ పిటిషన్ వేసే అర్హత రఘురామకు లేదని మరోసారి అన్నారు. గతంలోనూ ఇదే విధంగా వాదించారు. అయితే రఘురామ తరుపున న్యాయవాదులు మాత్రం అధికార దుర్వినియోగం, సాక్ష్యాలు ప్రభావితం తదితర అంశాలను ప్రస్తావించారు. అంతేకాకుండా రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగం వంటివి సాక్ష్యాలుగా చూపించారు.

ఇరువురి వాదనలు విన్న సీబీఐ కోర్టు మూడు పక్షాలను లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేయాలని చెప్పారు. గతంలో సీబీఐ మెరిట్ ప్రకారం నిర్ణయం అనే కౌంటర్ దాఖలు చేసిన సమయంలోనే కొత్త చీఫ్ వచ్చారు. దీంతో పాటు ఈ కేసు పక్కదారి పడుతుందన్న ఆరోపణలతో మెరిట్ ప్రకారం నిర్ణయం మీరే తీసుకోండి అని సీబీఐ కోర్టు అధికారులకు వదిలేశారు. దీంతో సీబీఐ నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.