https://oktelugu.com/

‘పంచాయితీ’కి చెక్.. నిమ్మగడ్డకు షాక్.. హైకోర్టులో ఇక జగన్ కు తిరుగులేదా?

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  కొద్దిరోజుల క్రితమే బదిలీ అయ్యారు. కొత్త ప్రధాన న్యాయమూర్తి ఇటీవలే కొలువుదీరారు. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం హైకోర్టుకెక్కిన తొలి కేసులోనే పాజిటివ్ స్పందన వచ్చింది. ఇది కాకతాళీయంగా జరిగిందా? ఏదైనా మార్పునో తెలియదు కానీ ఏపీ సీఎం జగన్ కు అయితే గొప్ప ఊరటనిచ్చింది. ఇప్పుడు హైకోర్టు చీఫ్ జస్టిస్ మారడంతోనే వచ్చిన ఈ తీర్పుతో ఇక జగన్ కు తిరుగులేదన్న చర్చ ఏపీ రాజకీయవర్గాల్లో సాగుతోంది. Also Read: […]

Written By:
  • NARESH
  • , Updated On : January 11, 2021 / 06:17 PM IST
    Follow us on

    ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  కొద్దిరోజుల క్రితమే బదిలీ అయ్యారు. కొత్త ప్రధాన న్యాయమూర్తి ఇటీవలే కొలువుదీరారు. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం హైకోర్టుకెక్కిన తొలి కేసులోనే పాజిటివ్ స్పందన వచ్చింది. ఇది కాకతాళీయంగా జరిగిందా? ఏదైనా మార్పునో తెలియదు కానీ ఏపీ సీఎం జగన్ కు అయితే గొప్ప ఊరటనిచ్చింది. ఇప్పుడు హైకోర్టు చీఫ్ జస్టిస్ మారడంతోనే వచ్చిన ఈ తీర్పుతో ఇక జగన్ కు తిరుగులేదన్న చర్చ ఏపీ రాజకీయవర్గాల్లో సాగుతోంది.

    Also Read: ఏపీలోని ఆ జిల్లాలో వింత ఘటన.. ముల్లంగిలో దర్శనమిచ్చిన గణపతి ఆకారం..!

    ఏపీలో తాజాగా ఓ గొప్ప శుభసూచికను అధికార వైసీపీ పార్టీ అందుకుంది. మొన్నటి వరకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ఏ కోర్టుల ద్వారానైతే ఏపీ సర్కార్ ను చెడుగుడు ఆడేశాడో ఇప్పుడు అదే కోర్టుల ద్వారా విజయం సాధించారు సీఎం జగన్. తాజాగా ఏపీలో పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ ను హైకోర్టు రద్దు చేసింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేస్తున్నట్లుగా ఆదేశాలు వెలువరించింది. వ్యాక్సినేషన్ కు ఆటంకం కలుగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

    నిమ్మగడ్డ రమేశ్ తాజా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ను ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపినా కూడా లెక్కచేయకుండా జారీ చేశారు.ఈ ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ పై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది.

    Also Read: తండ్రి అయిన విరాట్ కోహ్లీ.. తొలి సంతానం ఎవరంటే?

    ఈ క్రమంలోనే ప్రభుత్వం తరుఫున ఏజీ రెండు గంటల పాటు వాదనలు వినిపించారు. ఏకకాలంలో ఎన్నికలు కరోనా వ్యాక్సినేషన్ సాధ్యం కాదని కోర్టుకు వివరించారు. దీంతో ప్రభుత్వం వాదనకు ఏపీ హైకోర్టు అంగీకరించి ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేసింది.

    అయితే దీనిపై డివిజనల్ బెంచ్ కు వెళ్లాలని ఎస్ఈసీ నిర్ణయించినట్లు సమాచారం. ఇన్నాళ్లు నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పులు వచ్చేవన్న చర్చ నడిచింది. ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా ఈ తీర్పు రావడంతో సంతోషంగా వైసీపీ నేతలు ఫీలవుతున్నారు. దీన్ని బట్టి ఇక జగన్ సర్కార్ కు మంచిరోజులు వచ్చినట్టేనని సంబరపడుతున్నారు. ఇది ఎంతకాలం ఉంటుందో చూడాలి మరీ..

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్